ETV Bharat / bharat

'ఈటీవీ భారత్'​కు భారీ స్పందన- ఆ తల్లికి అందిన సాయం - karnataka woman sold her thaali for chikdren

పిల్లల ఆన్​లైన్ క్లాసుల కోసం.. మంగళసూత్రాన్నే తాకట్టుపెట్టిన తల్లి గురించి 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనానికి భారీ స్పందన వచ్చింది. కర్ణాటకకు చెందిన ఆ తల్లికి సాయం చేసేందుకు దాతలు ముందుకొచ్చారు.

etv-bharat-impact-many-people-helping-mother-who-pledged-her-gold-chain-to-buy-the-television-in-gadag-karnataka
తాళి తాకట్టు పెట్టిన తల్లికి సాయం అందింది!
author img

By

Published : Aug 1, 2020, 5:54 PM IST

'అమ్మ తాళి తాకట్టు పెట్టి, మా కోసం టీవీ కొనేసింది!'అనే శీర్షికతో ఈటీవీ భారత్ లో ప్రచురితమైన కథనానికి భారీ స్పందన లభించింది. కర్ణాటకలోని పలువురు ప్రముఖులు, అధికారులు గదగ్ జిల్లాకు చెందిన కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

'ఈటీవీ భారత్' కథనంపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి.. పిల్లల ఆన్ లైన్ చదువుల కోసం టీవీ కొనేందుకు తాళి తాకట్టు పెట్టిన తల్లి దీనస్థితిని ట్వీట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే జామీర్ అహ్మెద్ రూ.50 వేలు ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబానికి భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తానున్నాని భరోసా ఇచ్చారు. జిల్లా మంత్రి సీసీ పాటిల్ రూ.20 వేలు సాయమందించారు. ఇక జిల్లా బాలల సంరక్షణ యూనిట్ ఆమె ఇంటిని సందర్శించి.. ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున మూడేళ్లపాటు అందిస్తామన్నారు.

ఇదీ చదవండి: నాన్న ఫోన్ కొనివ్వలేదని అమ్మ చీరతో ఉరి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.