ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో రెండు డిగ్రీలు చదివి భిక్షాటన చేస్తున్న హన్సీ ప్రహారీపై.. ఈటీవీ భారత్ వచ్చినవరుస కథనలకు భారీ స్పందన లభించింది. ఇప్పటికే ఉద్యోగం కల్పిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వగా.. తాజాగా ఆమె తన కుటుంబాన్ని చేరగలిగారు.
హన్సీని కలిసేందుకు బుధవారం ఆమె సోదరుడు ఆనంద్.. హరిద్వార్ చేరుకున్నారు. తన చెల్లి పరిస్థితిని చూసి చలించిపోయారు. వీధుల్లో తిరుగుతూ యాచించటంపై ఆవేదన చెందారు. తనకు రాయటం, చదవటం నేర్పించిందని గుర్తు చేసుకున్నారు ఆనంద్.
అంతకు ముందు.. ఉత్తరాఖండ్ డీజీపీ రేఖా ఆర్యను కలిశారు ఆనంద్. హన్సీ ఈ స్థితికి చేరడానికి కారణమైన వారిపై దర్యాప్తు చేపట్టాలని కోరారు.
ఇవీ చూడండి: 'ఈటీవీ భారత్' ఎఫెక్ట్: హన్సీ ప్రహారికి ప్రభుత్వ ఉద్యోగం