ETV Bharat / bharat

మరో ఆర్నెల్ల పాటు 'కల్లోలిత ప్రాంతం'గా నాగాలాండ్​

author img

By

Published : Dec 30, 2020, 8:13 PM IST

నాగాలాండ్​ను మరో ఆరు నెలలపాటు 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్​ఎస్​పీఏ) కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Entire Nagaland declared 'disturbed area'
మరో ఆరు నెలలపాటు 'కల్లోలిత ప్రాంతం'గా నాగాలాండ్​

మరో ఆరు నెలలపాటు నాగాలాండ్​ను 'కల్లోలిత ప్రాంతం'గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ ప్రాంతంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్​ఎస్​పీఏ) కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ముందస్తు వారెంటు లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయవచ్చు.

కొన్ని దశాబ్దాలుగా నాగాలాండ్​లో ఏఎఫ్​ఎస్​పీఏ కొనసాగుతోంది. తాజా ప్రకటనతో డిసెంబర్​ 30 నుంచి మరో ఆరు నెలలపాటు ఈ చట్టం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నాగాలాండ్​లోని వివిధ ప్రాంతాల్లో హత్యలు, దోపిడీలు జరుగుతున్నందున కల్లోల ప్రాంతంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఏఎఫ్​ఎస్​పీఏను రద్దు చేయాలని నాగాలాండ్​లోని వివిధ వేర్పాటువాద సంస్థలు పెద్ద ఎత్తున డిమాండ్​ చేస్తున్నాయి.

2015 ఆగస్టులో ప్రధాన వేర్పాటువాద సంస్థ అయిన నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌- ఐఎమ్‌) వర్గంతో కేంద్ర ప్రభుత్వం ముసాయిదా ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐఎమ్‌) వర్గం నాయకుడు మూవాతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌.రవి జరిపిన చర్చలు సానుకూల ఫలితాలనిచ్చాయి. చర్చల్లో కొరకరాని కొయ్యలాగా మారిన నాగా ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగంపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'నాగా'ల సమస్యకు పరిష్కారం దిశగా కేంద్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.