అసోంలోని తిన్సుకియా జిల్లాలో అరుదైన జాతికి చెందిన 23 రాబందులు మృతి చెందాయి. రెండు పశువుల మృతదేహాల్ని తిన్న తరువాత ఇవి మరణించాయని అధికారులు తెలిపారు. డోలాలోని అటవీ ప్రాంతంలో రాబందులను గుర్తించారు. మరో పన్నెండు రాబందులను కాపాడారు.
"తాలప్ అటవీ ప్రాంతంలో ఆదివారం రాబందుల మృతదేహాల్ని గమనించాం. పన్నెండు రాబందుల పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వాటికి చికిత్స అందిస్తున్నాం. విషం ప్రభావం ఎంతమేరకు ఉందో తెలియలేదు. పక్షుల మృతదేహాల్ని శవపరీక్ష కోసం పంపించాం."
-అటవీ శాఖ అధికారి
మృతి చెందిన రాబందులు చాలా అరుదైనవని అధికారులు తెలిపారు. ఈ జీవులు వేగంగా అంతరించిపోతున్నాయని చెప్పారు.
బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వివరాల ప్రకారం గిమ్సీ హిమాలయ గ్రిఫ్ఫన్ రాబందు జాతికి చెందిన వీటి జనాభా భారత్-నేపాల్లో 4 కోట్లుగా ఉండేది. కేవలం రెండు దశాబ్దాల్లోనే అందులో 99.99 శాతం అంతరించిపోయాయి.
ఇదీ చూడండి: దారుణం: 4 నెలల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి