జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వీళ్లను జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు. వీరి దగ్గరి నుంచి వివిధ రకాల ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
పక్కా సమాచారంతో...
పక్కా సమాచారంతో ఉదయం గహంద్ ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు దీటుగా బదులిస్తున్నాయి.