ఉత్తర్ ప్రదేశ్ భాజపా ఎంపీ రీతా బహుగుణ ఇంట్లో దీపావళి వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. పండుగ రోజు బాణసంచా కాల్చుతుండగా జరిగిన ప్రమాదంలో రీతా మనవరాలు మయాంక్ జోషి(8) చనిపోయింది.
ప్రయాగ్‌రాజ్‌లోని రిటా బహుగుణ జోషీ నివాసంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. దీపావళి రోజు రాత్రిపూట రిటా మనవరాలు కియా టపాసులు పేల్చేందుకు ఇంటి టెర్రస్‌పైకి వెళ్లింది. టపాసులు అంటిస్తుండగా కియా దుస్తులకు నిప్పంటుకుంది. అయితే బాణాసంచా పేలుడు శబ్దాల వల్ల చిన్నారి అరుపులు ఎవరికీ వినిపించలేదు. కొద్దిసేపటి తర్వాత గాయాలతో పడి ఉన్న కియాను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి శరీరం 60శాతం కాలిపోయింది.
ఘటన అనంతరం రిటా బహుగుణ జోషీ.. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హర్షవర్ధన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడారు. మెరుగైన చికిత్స నిమిత్తం చిన్నారిని దిల్లీకి తరలించేందుకు సాయం చేయాలని కోరారు. మంగళవారం చిన్నారిని దిల్లీకి తరలించాల్సి ఉండగా.. పరిస్థితి విషమించి నేటి తెల్లవారుజామున కియా కన్నుమూసింది. కాగా, ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఈ చిన్నారి.. దురదృష్టవశాత్తూ ఇలా ప్రాణాలు కోల్పోవడంతో రిటా కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇదీ చూడండి: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం.. ఆపై అవయవాల తొలగింపు