ETV Bharat / bharat

డీఆర్​డీఓ ఆధ్వర్యంలో 8 పరిశోధన కేంద్రాలు - పార్లమెంటు సమావేశాలు 2020

అత్యాధునిక సైనిక పరికరాల ఉత్పత్తికి 8 ఉన్నతస్థాయి పరిశోధన కేంద్రాలను డీఆర్​డీఓ ఏర్పాటు చేసిందని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా డీఆర్​డీఓకు 50 ప్రయోగశాలలు ఉన్నాయని రక్షణ శాఖ సహాయమంత్రి రాజ్యసభలో వెల్లడించారు.

drdo
డీఆర్​డీఓ
author img

By

Published : Sep 20, 2020, 6:43 AM IST

అత్యాధునిక మిలిటరీ సామగ్రి తయారు చేయడానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) ఎనిమిది ఉన్నతస్థాయి పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాజ్యసభలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్​ ఈ విషయాన్ని ప్రకటించారు. డీఆర్​డీఓకు దేశవ్యాప్తంగా 50 ప్రయోగశాలలు ఉన్నాయని అన్నారు.

వీటి సామర్థ్యాన్ని పెంచే విషయమై సలహాలు ఇచ్చేందుకు ఐఐటీ- దిల్లీ డైరెక్టర్​ ప్రొఫెసర్​ వి.రామగోపాలరావు ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆయుధాలను తయారు చేస్తోన్న ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీ బోర్డును కార్పొరేట్​ సంస్థగా మార్చనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: మిలటరీ క్యాంటీన్​లో 'మేడ్​ ఇన్​​ ఇండియా' అమలవుతోందా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.