ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ మాజీ సీఎం అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ

జమ్ముకశ్మీర్​ క్రికెట్​ అసోసియేషన్​ మనీ లాండరింగ్​ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్​ అబ్దుల్లాను ప్రశ్నించింది. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలం నమోదు చేసింది.

author img

By

Published : Jul 31, 2019, 9:53 PM IST

జమ్ముకశ్మీర్​ మాజీ సీఎం అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ

జమ్ముకశ్మీర్​ క్రికెట్​ అసోసియేషన్​ ఆర్థిక లావాదేవీల అవకతవకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్​ అబ్దుల్లాను ప్రశ్నించింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ)​. కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది.

బుధవారం ఛండీగఢ్​లోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు అబ్దుల్లా. ఈ మేరకు ఆయనను ప్రశ్నించిన అధికారులు మనీ లాండరింగ్​ నిరోధక చట్టం కింద వాంగ్మూలం నమోదు చేశారు.

ఇదీ కేసు...

2002-11 మధ్య జమ్ముకశ్మీర్​లో క్రికెట్​ అభివృద్ధికి బీసీసీఐ సుమారు రూ.43 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ గత ఏడాది జులైలో అబ్దుల్లాతో పాటు జేకేసీఏ ప్రధాన కార్యదర్శి మహమ్మద్​ సలీమ్​ ఖాన్​, ఖజానా అధికారి అహ్సాన్​ అహ్మద్​ మిర్జా, జేకే బ్యాంక్​ అధికారి బషిర్​ అహ్మద్​ మిస్​గర్​పై ఛార్జి​షీట్​ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు 2015 నుంచి ఈ కేసుపై దర్యాప్తు చేపట్టింది. సీబీఐ ఎఫ్​ఐఆర్, ఛార్జి​షీట్​​ ప్రకారం అక్రమ నగదు బదిలీ కేసు నమోదు చేసింది ఈడీ.

విచారణకు సిద్ధం...

క్రికెట్​ అసోసియేషన్​ ఆర్థిక లావాదేవీల అవకతవకల్లో తాను ఎలాంటి తప్పు చేయలేదని ఉద్ఘాటించారు నేషనల్​ కాన్ఫరెన్స్​ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్​ అబ్దుల్లా. విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దేశంలోని న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసముందని అన్నారు.

ఇదీ చూడండి: రేపు సుప్రీంకు అయోధ్య మధ్యవర్తిత్వ కమిటీ నివేదక

Intro:Body:

p

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.