నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ అధినేత, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సహా మరికొందరి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం జప్తుచేసింది. జమ్ము కశ్మీర్ క్రికెట్ సంఘంలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఓ హవాల కేసులో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
జమ్ము, శ్రీనగర్‌లో రూ.11.86 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే వాటి మార్కెట్ విలువ రూ.60కోట్ల పైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ కేసులో ఫరూక్‌ను ఇదివరకే పలుమార్లు ఈడీ ప్రశ్నించింది.
ఇదీ చూడండి: మళ్లీ ఉగ్రవాదంవైపు కశ్మీరీ యువత- నెలకు 12మంది!