ETV Bharat / bharat

'సేనను అవమానిస్తే ప్రేమలేఖతో సరిపెడతారా?' - ఆధిత్యనాథ్

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైన్యాన్ని ఉద్దేశించి 'మోదీ సైన్యం' అనటంపై ఈసీ సరైన చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. న్యాయ్ పథకంపై నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ వ్యాఖ్యలు చేయటంపైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం బాధాకరమంది. ఎంసీసీ అంటే మోదీ కోడ్​ ఆఫ్​ కండక్ట్ అయిపోయిందని ఎద్దేవా చేసింది కాంగ్రెస్.

ఇదేం తీరు? : ఈసీపై కాంగ్రెస్ ఆగ్రహం
author img

By

Published : Apr 6, 2019, 4:24 PM IST

Updated : Apr 6, 2019, 5:24 PM IST

'సేనను అవమానిస్తే ప్రేమలేఖతో సరిపెడతారా?'

కేంద్ర ఎన్నికల సంఘం తీరు సరిగా లేదంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత సైన్యాన్ని​ 'మోదీ సైన్యం' అని వ్యాఖ్యానిస్తే ఈసీ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. చిన్నహెచ్చరికతో సరిపెట్టటం ఏంటని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్​.

కాంగ్రెస్​ కనీస ఆదాయ పథకం 'న్యాయ్' హామీ​పై విమర్శలు చేసిన నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​ రాజీవ్​ కుమార్​పై ఈసీ చర్యలు చేపట్టకపోవటంపైనా తీవ్రంగా స్పందించింది ఆ పార్టీ. న్యాయ్​పై తీవ్ర ఆరోపణలు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కేవలం హెచ్చరికలు చేసి ఊరుకున్నారని అసహనం వ్యక్తంచేసింది. ప్రస్తుతం ఎంసీసీ(ఎన్నికల నిబంధనావళి) అంటే 'మోదీ కోడ్​ ఆఫ్​ కండక్ట్​'గా మారిపోయిందని విమర్శించింది.

ఈసీపై ట్విట్టర్​ వేదికగా విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా.

"ఆదిత్యనాథ్​ భారత సైన్యాన్ని అవమానించారు. ఈసీ ఆయనకు ప్రేమ లేఖ పంపింది. నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​ న్యాయ్​ పథకాన్ని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటివి చేయొద్దని మాత్రమే హెచ్చరించింది." -రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

New Delhi, Apr 06 (ANI): Hindu festival 'Chaitra Navratri' began on Saturday and marked its day 1 celebration with the worship of Goddess 'Shailputri'. Devotees reached to Kalkaji Temple and Jhandewalan Temple to worship the goddess and to pay their tribute in New Delhi.

Last Updated : Apr 6, 2019, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.