ప్రచారంలో అభ్యర్థుల వ్యయంపై పరిమితులు ఉన్నట్టే పార్టీల ఖర్చులపైనా అదుపు ఉండాలని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం సూచించింది. ప్రచారంలో జరుగుతున్న వ్యయంపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఈ మేరకు సిఫార్సు చేసింది.
ప్రస్తుతానికి పార్టీల వ్యయంపై ఎలాంటి నియంత్రణలు లేవని, ఆ లోపాన్ని సరిదిద్దుతూ విధానాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది.