ETV Bharat / bharat

'రిమోట్​ ఓటింగ్​పై త్వరలో మాక్​ ట్రయల్స్​' - block chain technology

రిమోట్​ ఓటింగ్​ను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. సంబంధిత అంశంపై పరిశోధన ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపింది.

EC to soon begin mock trials for remote voting: CEC
రిమోట్​ ఓటింగ్​పై త్వరలో మాక్​ ట్రయల్స్​: సీఈసీ
author img

By

Published : Jan 25, 2021, 1:15 PM IST

ఓటర్లకు 'రిమోట్​ ఓటింగ్'​ సౌకర్యం కల్పించే దిశగా మాక్​ ట్రయల్స్​ త్వరలోనే ప్రారంభమవుతాయని.. భారత ప్రధాన ఎన్నికల అధికారి​ సునీల్​ అరోడా తెలిపారు. అత్యాధునిక పరిజ్ఞానంతో 'రిమోట్​ ఓటింగ్'​పై పరిశోధన ప్రాజెక్టు ఇప్పటికే మొదలైందని తెలిపారు. ఈ మేరకు '11వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని' పురస్కరించుకొని ఇచ్చిన సందేశంలో వివరాలు వెల్లడించారు.

"ఈ విషయంలో మంచి పురోగతి ఉంది. మాక్​ ట్రయల్స్​ త్వరలోనే ప్రారంభమవుతాయి" అని సీఈసీ స్పష్టం చేశారు. విదేశీ భారతీయ ఓటర్లకు పోస్టల్​ బ్యాలెట్​ సౌకర్యాన్ని విస్తరించే అంశంపై.. పోస్టల్​ ప్యానల్​ చేసిన ప్రతిపాదననూ న్యాయ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడించారు.

ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన 'బ్లాక్​చైన్​ టెక్నాలజీ' గురించి మాజీ డిప్యూటీ ఎలక్షన్​ కమిషనర్ సందీప్​ సక్సేనా​ గతంలోనే వెల్లడించారు. 'పూర్తి నియంత్రిత విధానంలో టూ వే ఎలక్ట్రానిక్ ఓటింగ్​ వ్యవస్థ ఇందులో నిక్షిప్తమై ఉంటుందని' ఆయన తెలిపారు. ​

" ముందుగా నిర్ణయించిన వేదిక వద్దకు ఓటరు చేరుకోవాల్సి ఉంటుంది. ఓటరు సమాచారాన్ని కంప్యూటర్ గుర్తించగానే.. ఈ-బ్యాలెట్​ పేపర్​ వస్తుంది. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం.. బ్లాక్​చైన్​ వ్యవస్థ జాగ్రత్తగా సమాచారాన్ని భద్రపరుస్తుంది. దానిని అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలకు పంపిస్తుంది. సదరు వ్యవస్థలో అవకతవకలు జరగలేదని నిరూపించడానికి.. వేసిన ఓటును వేసినట్లే లెక్కలోకి తీసుకుంటారు. ఇది ఇంటి నుంచి ఓటు వేయడం ఎంత మాత్రం కాదు."

-కేంద్ర ఎన్నికల సంఘం

ఇదీ చదవండి: భారత్​- చైనా సైనికుల మధ్య మళ్లీ ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.