ETV Bharat / bharat

కరోనా కారణంగా బిహార్​ ఎన్నికల రూల్స్​లో మార్పు - బిహార్ ఎన్నికల ప్రచారం

బిహార్​ ఎన్నికల ప్రచార ప్రసారాల సమయాన్ని రెట్టింపు చేసింది ఎలక్షన్​ కమిషన్​. కరోనా నేపథ్యంలో నాన్​- కాంటాక్ట్ ఆధారిత ఎన్నిక ప్రచారం సజావుగా జరిగేలా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన ఒక్కో పార్టీ 90 నిమిషాల పాటు ప్రసారాలు చేసుకోవచ్చు.

bihar
బిహార్​
author img

By

Published : Oct 10, 2020, 7:22 AM IST

కరోనా నేపథ్యంలో బిహార్​ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దూరదర్శన్​, ఆల్​ ఇండియా రేడియాల్లో రాజకీయ పార్టీల ప్రచార ప్రసారాల సమయాన్ని రెట్టింపు చేసినట్లు తెలిపింది. 'నాన్​- కాంటాక్ట్' ఆధారిత ఎన్నికల ప్రచారం సజావుగా జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

అయితే, ఈ నిబంధనలు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకే వర్తిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం ఒక్కో పార్టీ 90 నిమిషాల పాటు ప్రసారాలు చేసుకోవచ్చు. కానీ, ఒకే ప్రసార సెషన్‌లో ఏ పార్టీకి 30 నిమిషాలకు మించి కేటాయించరు.

ఈ నిబంధనలు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నాటి నుంచి ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకు వర్తిస్తాయి. ప్రచార ప్రసారాలకు సంబంధించిన ట్రాన్స్​స్క్రిప్ట్లు, రికార్డింగ్​లు ముందుగానే ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది.

బిహార్​లో అక్టోబర్​ 28, నవంబర్​ 3, నవంబర్​ 7న.. మొత్తం మూడు దశల్లో జరిగే ఎన్నికల ఫలితాలు నవంబర్​ 10న ప్రకటిస్తారు.

ఇదీ చూడండి: 'బిహార్​ ఎన్నికల ప్రచారానికి 47 మైదానాలు, 19 హాళ్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.