దేశవ్యాప్తంగా ఒక లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వాయిదా వేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ వీటిని ఎప్పుడు నిర్వహించాలనే దానిపై శుక్రవారం నిర్ణయం తీసుకోనుంది.
బిహార్‌లో వాల్మీకి నగర్ లోక్‌సభ స్థానంతో పాటు తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండేసి, అసోం, మధ్యప్రదేశ్, కేరళలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా, వరదల కారణంగా ఈ ఉపఎన్నికలను వాయిదా వేసినట్లు ఎన్నికల సంఘంలో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా ఒక లోక్‌సభ నియోజకవర్గంతో పాటు 56 అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.
ఇదీ చూడండి: జనావాసాల్లో ఏనుగులు హల్చల్