ETV Bharat / bharat

ఈ వారంలోనే భారత్-చైనా 8వ దఫా సైనిక చర్చలు!

భారత్​, చైనా మధ్య 8వ రౌండ్ సైనిక చర్చలు ఈ వారంలో జరగనున్నాయి. శీతకాలం ప్రారంభం కానున్న తరుణంలో సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేసే అంశమై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

DEF-SINOINDIA-TALKS
భారత్-చైనా
author img

By

Published : Oct 19, 2020, 5:00 AM IST

భారత్​, చైనా మధ్య 8వ దఫా కార్ప్స్​ కమాండర్-స్థాయి చర్చలు ఈ వారం జరిగే అవకాశం ఉంది. శీతకాలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్న అంశంపై చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, భేటీకి సంబంధించి స్పష్టమైన తేదీ ఇంకా ఖరారు కాలేదు.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ బాధ్యత చైనాపైనే ఉందని భారత్​ మొదటి నుంచి వాదిస్తోంది. అక్టోబర్​ 12న జరిగిన ఏడో దఫా చర్చల్లో ఉపసంహరణ ప్రక్రియకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నా.. అందులో ఎలాంటి పురోగతి లేదు. కానీ, చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని ఇరు వర్గాలు ప్రకటించాయి.

ఆరో దఫా చర్చల్లో కీలక నిర్ణయాలు..

ఆరో రౌండ్ సైనిక చర్చల తర్వాత సరిహద్దులకు ఎక్కువ మంది సైనికులను పంపవద్దని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చకూడదని ఇరుదేశాలు నిర్ణయించాయి. సరిహద్దు ఉద్రిక్తతలను క్లిష్టతరం చేసే చర్యలను నిలిపేయటం సహా అనేక నిర్ణయాలను ప్రకటించాయి.

మాస్కోలో సెప్టెంబర్ 10న జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో భాగంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్​యీ భేటీ అయ్యారు. ఇందులో కుదిరిన అంశాల ఒప్పందం ఎజెండాతో ఆరో దఫా సైనిక చర్చలు జరిగాయి.

ఇదీ చూడండి: 'అదే భారత్​, చైనా సంబంధాలపై ప్రభావం చూపిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.