ETV Bharat / bharat

గుజరాత్​, అసోం రాష్ట్రాల్లో భూప్రకంపనలు - earthquake assam

Earthquake strikes parts of Gujarat and Assam
గుజరాత్​, అసోం రాష్ట్రాల్లో భూప్రకంపనలు
author img

By

Published : Jul 16, 2020, 9:20 AM IST

Updated : Jul 16, 2020, 10:31 AM IST

10:23 July 16

దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భూప్రకంపనలు సంభవించాయి. గుజరాత్​లోని రాజ్​కోట్​లో గురువారం ఉదయం 7:40 గంటలకు భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.5గా నమెదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది.

ఈశాన్య రాష్టం అసోంలో ఉదయం 7:57 గంటలకు భూమి స్వల్పంగా కపించించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.1గా నమోదైంది.

హిమాచల్​ప్రదేశ్​లోని ఉనాలో ఉదయం 4:47 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 2.3గా ఉంది.

ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.

ఈశాన్య రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. భుకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రపంచంలోనే 6వ స్థానంలో ఉంది ఈశాన్య ప్రాంతం.

3 రోజుల క్రితమే..

గుజరాత్​లోని కఛ్ జిల్లాలో ఆదివారం రాత్రే భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై నమోదైన 5.3 తీవ్రత ధాటికి చుట్టుపక్కల 122 కి.మీ మేర భూమి కంపించింది. గాంధీ నగర్, అహ్మదాబాద్​, రాజ్​కోట్​, మోర్బి, జాంనగర్​, పాటణ్​, వడోదర ప్రాంతాల్లో 9 సెకన్లపాటు భూమి కంపించింది.

09:15 July 16

గుజరాత్​, అసోం రాష్ట్రాల్లో భూప్రకంపనలు

గుజరాత్, అసోం రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. గుజరాత్​లోని రాజ్‌కోట్‌లో భూకంపలేఖినిపై తీవ్రత 4.5గా నమోదైంది. అసోం కరింగంజ్​లో 4.1 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది.

Last Updated : Jul 16, 2020, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.