లాక్‌డౌన్ వల్ల పర్యటక, ఆతిథ్య రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనా వైరస్ ముప్పుతో ఇప్పుడప్పుడే పర్యటక రంగానికి ఊపు వచ్చేలా కనిపించడం లేదు. అన్ని దేశాలు, నగరాలు వైరస్ ముప్పుతో తల్లడిల్లుతున్నాయి. అయినప్పటికీ సంక్షోభం తర్వాత దుబాయ్, ముంబయి నగరాలను సందర్శించడమే తమ తొలి ప్రాధాన్యమని టూరిస్టులు చెబుతున్నారు.
డిజిటల్ ట్రావెల్ కంపెనీ బుకింగ్.కామ్ 2020, మార్చి-ఏప్రిల్ మధ్య ఈ సర్వే చేసింది. ముంబయి నగరమే తమ పర్యటక గమ్యస్థానమని ఎక్కువమంది భారతీయులు ఓటు వేశారు. ఆ తర్వాతి స్థానాల్లో గోవా, దిల్లీ, లోనావాలా, బెంగళూరు నిలిచాయి. ఇక అంతర్జాతీయంగా దుబాయ్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత ఉబుద్ (బాలి), బ్యాంకాక్ (థాయ్‌ల్యాండ్), ఇస్తాంబుల్ (టర్కీ), లండన్ (బ్రిటన్) ఉన్నాయి.
తమ ఇంటి నుంచి బయటకు వస్తే ఎక్కువ మంది భారతీయ పర్యటకులు హోటళ్లలో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. ఆ తర్వాత రిసార్టులు, అతిథి గృహాలు, అపార్టుమెంటులు, విల్లాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. దాదాపు 42 శాతం మంది హోటళ్లు, 18 శాతం మంది రిసార్టులకు ఓటువేశారు.
అంతర్జాతీయ టూరిస్టుల విషయానికి వస్తే భారత్‌లో దిల్లీ, ముంబయి, గోవా, జైపుర్, బెంగళూరును ఎక్కువగా సందర్శించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ముంబయి, దుబాయ్‌ల్లో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది.
ఇదీ చూడండి: కరోనా నిధికి రూ. 10వేలు విరాళమిచ్చిన భిక్షగాడు