మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అసోం పోలీసులు మరో విజయం సాధించారు. హెరాయిన్ సహా రూ.8 కోట్ల విలువైన నిషేధిత మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
దక్షిణ అసోం జిల్లాలోని కొంతమంది అనుమానిత వ్యక్తులపై కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. పక్కా ప్రణాళికతో ఆదివారం సోదాలు నిర్వహించగా మాదకద్రవ్యాల వ్యవహారం బయటపడింది. 2 కిలోల హెరాయిన్, 10 కిలోల అఫింగ్, క్వింటాల్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల మధ్య ఉంటుందని తెలిపారు.
దింగ్ రెవెన్యూ పరిధిలోని సోనారిగావ్లో హబిల్ అలీ ఇంట్లో ఇవి బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో హబిల్ అలీ, మొఫిదుల్ హాక్, బహదుల్ అలమ్ అనే ముగ్గురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు.