ETV Bharat / bharat

డాక్టర్​ రెడ్డీస్ కొత్త అస్త్రం- చౌక ధరకే దివ్య ఔషధం - Dr Reddy's Laboratories CEO

దేశంలో జనరిక్ క్యాన్సర్​ ఔషధం 'ఇన్విస్టా'ను విడుదల చేసింది డాక్టర్​ రెడ్డీస్​. భారతీయులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేందుకు ఈ ఔషధ ఉత్పత్తి ప్రారంభించినట్లు స్పష్టం చేసింది.

author img

By

Published : Apr 13, 2020, 7:20 PM IST

దేశంలో బ్లడ్​ క్యాన్సర్​ చికిత్స కోసం 'ఇన్విస్టా' పేరిట జనరిక్ డ్రగ్​ను విడుదల చేసింది దిగ్గజ ఔషధ సంస్థ డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబొరేటరీ. డాసాటినిబ్​ ఔషధం ఫార్ములేషన్​ ఆధారంగా ఈ డ్రగ్​ను ఉత్పత్తి చేసినట్లు తెలిపింది.

పేటెంట్ ముగిసిన ఒక్క రోజులోనే...

డాసాటినిబ్​పై పేటెంట్​ బ్రిస్టల్-మైర్స్​-స్విబ్ పేరిట ఉంది. భారత్​లో ఈ పేటెంట్ ఏప్రిల్​ 12న ముగిసింది. మరుసటి రోజే జనరిక్ వెర్షన్​ను విడుదల చేసింది డాక్టర్ రెడ్డీస్.

క్రానిక్ మైలాయిడ్ లుకేమియా (సీఎంఎల్​) చికిత్సలో ఉపయోగించే ఇన్విస్టా 50, 70, 100 మిల్లీగ్రాముల మాత్రలలో అందుబాటులో ఉంటుంది.

పశ్చిమ దేశాలతో పోల్చితే భారత్​లో సీఎంఎల్​ బారిన పడే వారి సగటు వయసు దాదాపు పదేళ్లు తక్కువగా ఉంది. ఏటా కొత్తగా 9 వేల మందికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధరణ అవుతోంది.

"ఇన్విస్టా అభివృద్ధి, విడుదల... భారత్​లోని సీఎంఎల్​ రోగులకు చౌక ధరకే మేలైన ఔషధాలు అందించే దిశగా పడిన ముందడుగు."

-ఎంవీ రమణ, డాక్టర్​ రెడ్డీస్​ సీఈఓ(బ్రాండెడ్ మార్కెట్స్​)

ఇదీ చూడండి: దేశంలో కరోనా విజృంభణ- పలు రాష్ట్రాల్లో లాక్​డౌన్ కొనసాగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.