ETV Bharat / bharat

రైతుల సహనాన్ని పరీక్షించొద్దు: పవార్​

రైతుల నిరసనలు కొనసాగుతున్న వేళ కేంద్రంపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. దేశంలోనే అత్యల్పమైన బిహార్​ రైతుల ఆదాయంతో ఇతర అన్నదాతల ఆదాయాన్ని సమానం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్రంపై ధ్వజమెత్తారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. మరోవైపు రైతుల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​.

author img

By

Published : Dec 11, 2020, 5:11 PM IST

Don't test tolerance of farmers: Pawar tells Centre
రైతుల సహనాన్ని పరీక్షించవద్దు: శరద్​ పవార్​

కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. బిహార్​ రైతుల ఆదాయంతో దేశంలోని అన్నదాతల ఆదాయాన్ని సమానం చేయాలని మోదీ సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు​. దేశంలో పంజాబ్​ రైతులు అత్యధిక ఆదాయం పొందుతుండగా.. బిహార్​ రైతులు అత్యల్ప ఆదాయం సంపాదిస్తున్నారన్న ఓ మీడియా నివేదికను రాహుల్​ ఉటంకించారు.

"దేశంలోని రైతులందరూ పంజాబ్​ రైతుల ఆదాయంతో సమానమైన సంపదను పొందాలని భావిస్తున్నారు. అయితే మోదీ ప్రభుత్వం అందుకు భిన్నంగా రైతుల ఆదాయాన్ని బిహార్​ రైతుల ఆదాయంతో సమానం చేయలని చూస్తోంది" అని హిందీలో ట్వీట్​ చేశారు రాహుల్​.

'దేశంలో రైతుల సగటు వార్షిక ఆదాయం రూ.77,124. పంజాబ్​ రైతులు వార్షిక ఆదాయం రూ.2,16,708(అత్యధికం). బిహార్​ రైతుల సంపాదన రూ.42,684 మాత్రమే'నన్న ఓ సర్వేను ప్రస్తావించారు రాహుల్.

'రైతుల సహనాన్ని పరీక్షించవద్దు'

'కర్షకుల సహనాన్ని పరీక్షించవద్దు' అంటూ కేంద్రాన్ని హెచ్చరించారు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​​. పరిస్థితులు చూస్తుంటే రైతుల దీక్ష మరికొన్ని రోజులు సాగేలా ఉందని అభిప్రాయపడ్డారు. సకాలంలో నిర్ణయం తీసుకోకపోతే.. రైతుల నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించవచ్చని వ్యాఖ్యానించారు. 'సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు ఉద్ధృతంగా ఆందోళన చేస్తున్నారు. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి' అని శరద్​ కేంద్రాన్ని కోరారు.

వ్యవసాయ బిల్లులపై చర్చ జరపాలని అప్పట్లో విపక్షాలు కోరినప్పటికీ ప్రభుత్వం అలా చేయకుండా హడావుడిగా ఆమోదింపచేసుకుందని ఆరోపించారు పవార్.

ఇదీ చూడండి: నల్లకుబేరులకు జీవితఖైదుపై వ్యాజ్యం కొట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.