కర్ణాటకలో భాజపా అసంతృప్త ఎమ్మెల్యేల రహస్య సమావేశాలపై ఇప్పటికే పలు వార్తలు వినిపించాయి. ఇందులో సీఎం మార్పే లక్ష్యంగా చర్చించారని సమాచారం బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలో అసమ్మతి ఎమ్మెల్యేల రహస్య సమావేశాల అంశమై ఆందోళన చెందాల్సిన పని లేదని.. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు అభయమిచ్చారు భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా. రాష్ట్రంలో కరోనా నియంత్రణ వైపే దృష్టి సారించాలని, ఎమ్మెల్యేల అంశమై ఆందోళన అవసరం లేదని షా స్పష్టం చేసినట్లు సమాచారం.
'నేను చూసుకుంటాను'
శుక్రవారం రాత్రి యడియూరప్పతో ఫోన్లో సంభాషించారు అమిత్షా. అసంతృప్త ఎమ్మెల్యేలు, పార్టీ నేతల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు యడ్డీతో అమిత్షా పేర్కొన్నారని సమాచారం. అసమ్మతి ఎమ్మెల్యేల డిమాండ్లు, వారి అసంతృప్తికి కారణాలపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ఆపరేషన్ హస్తం: కర్ణాటకలో ఏం జరుగుతోంది?