ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను చూసి కార్యకర్తలు నిరాశ చెందవద్దని సందేశమిచ్చారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. పార్టీపై నమ్మకంతో అప్రమత్తంగా ఉండాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
"వచ్చే 24 గంటలు చాలా కీలకం. చురుగ్గా, అప్రమత్తంగా ఉండాలి. భయపడొద్దు. మీరు నిజం కోసం పోరాడుతున్నారు. తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రచారం చూసి నిరుత్సాహపడొద్దు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. కాంగ్రెస్‌పై నమ్మకం ఉంచండి. మీ శ్రమ వృధా కాదు. జైహింద్."
-రాహుల్ ట్వీట్
ఈవీఎంలు ట్యాంపరింగ్‌లకు గురయ్యాయనే ఆరోపణలతో కౌంటింగ్ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ప్రతిపక్షాలు ఇప్పటికే కోరగా... రాహుల్ తాజాగా ట్విట్టర్లో ఈ సందేశమిచ్చారు.
ఇదీ చూడండి: ఈవీఎంల తర్వాతే స్లిప్పుల లెక్క: ఈసీ