ETV Bharat / bharat

కాళ్లు, చేతులకు బేడీలతో 10 కి.మీ ఈత - స్విమ్మర్​ ​ రతీశ్​

ఎవరైనా నీటిలో ఎంతదూరం ఈదగలరు? మహా అయితే.. ఓ అర కిలోమీటరు. లేదా కిలోమీటరు. కానీ, కేరళకు చెందిన 'డాల్ఫిన్'​ రతీశ్​.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది కిలోమీటర్ల దూరాన్ని ఈదాడు. అదీ.. కాళ్లు చేతులు బంధించి ఉండగా. గిన్నిస్​ పుస్తకంలో చోటు సంపాదించడం కోసం అతడీ సాహసం చేశాడు​.

Dolphin' Ratheesh swims against the currents with chained hands and legs; Sets Guinness World record by crossing 10 km in about 5 hours
భళా.. రతీశ్! కాళ్లు, చేతులు బంధించుకుని పది కిలోమీటర్ల ఈత
author img

By

Published : Nov 20, 2020, 2:31 PM IST

కేరళలోని కరునాగపల్లికి చెందిన స్విమ్మర్​ రతీశ్​ ఓ అరుదైన ఘనత సాధించాడు. కాళ్లు, చేతులు బంధించి ఉండగా.. పది కిలోమీటర్లు దూరాన్ని నీళ్లలో ఈది, గిన్నిస్​ రికార్డు సంపాదించాడు. ఆటుపోటులు మధ్య, నీటి అలలకు ఎదురీదుతూ ఐదు గంటల్లో ఈ సాహసం పూర్తి చేశాడు 'డాల్ఫిన్' రతీశ్​. కేరళలోని టీఎస్​ కాలువ ఇందుకు వేదికైంది.

కాళ్లు, చేతులకు బేడీలతో 10 కి.మీ ఈత

ఇలా సాగింది...

చేతుల మధ్య 20 సెంటిమీటర్ల దూరం మాత్రమే ఉండేలా బేడీలను ధరించాడు రతీశ్​​. 30 సెంటిమీటర్ల దూరం మాత్రమే ఉండేలా కాళ్లను తాడుతో కట్టుకున్నాడు.

ఒడ్డున నిలుచున్న స్థానికులు.. ఈలలు, చప్పట్లతో ప్రోత్సాహించగా.. రతీశ్​ ఈత కొనసాగింది. తొమ్మిది కిలోమీటర్ల దూరాన్ని అతడు నాలుగు గంటల్లో ఈదగా.. చివరి కిలోమీటర్​ దూరాన్ని ఛేదించడానికి గంటన్నరకు పైగానే సమయం పట్టింది. అజీక్కల్​ వంతెన వద్దకు చేరుకోగా​.. రికార్డు పూర్తైంది. నీటిలో సుడిగుండాలు, ఆటుపోటులు ఎదురైనప్పటికీ.. దిగ్విజయంగా రతీశ్ బుధవారం​ ఈ సాహసాన్ని పూర్తి చేశాడు.

ఈ విన్యాసంతో కర్ణాటక ఉడుపికి చెందిన గోపాల్​ ఖర్పి పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు రతీశ్​. అయితే... గిన్నిస్​ బుక్ ​నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సాహసాలకు పెట్టింది పేరు..

కరునాగపల్లి చెరియాజీక్కల్​కు చెందిన కుసుమ, రాధాకృష్ణన్​ దంపతుల రెండో కుమారుడు రతీశ్​. ​18 ఏళ్లుగా ఈతలో సాహసాలు చేస్తున్నాడు అతడు. అందుకే అతడ్ని అందరూ 'డాల్ఫిన్'​ రతీశ్​ అని పిలుస్తారు. నీటిలో చిక్కుకున్న అనేక మంది ప్రాణాలను అతడు​ కాపాడాడు.

ప్రతిష్టాత్మక లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో మూడు సార్లు చోటు దక్కించుకున్నాడు అతడు​. అరేబియన్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో ఒకసారి తన పేరు నమోదు చేసుకున్నాడు. అకుంఠిత దీక్ష, నిరంతర సాధనే తన విజయాలకు కారణాలని చెబుతాడు 38 ఏళ్ల రతీశ్​.

ఇదీ చూడండి:15 గంటలు శ్రమించి.. గజరాజును రక్షించి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.