రోట్వీలర్ జాతికి చెందిన రానా.. అదే జాతికి చెందిన శునకం 'రోటీ'కి రక్తదానం చేశాడు. సాటి శునకం ప్రాణాలు కాపాడి అందరి మన్ననలు పొందుతున్నాడు.
కర్ణాటక ధార్వాడ్‌లోని 'సుందర సిటీ' ప్రాంతానికి చెందిన మనీశ్ కులకర్ణి పెంచుకుంటున్న గారాల శునకం పేరు రానా. రానా చాలా తెలివైన, విశ్వాసమైన శునకం. అందుకే యజమాని చెప్పగానే మారాం చేయకుండా సాటి శునకానికి సాయం చేశాడు.
ధార్వాడ్‌కు చెందిన గణేశ్ పెంపుడు కుక్క 'రోటీ' గత కొన్ని రోజులుగా కామెర్ల వ్యాధితో బాధపడుతోంది. రోటీకి రక్త కణాల శాతం తగ్గిపోయిందని, వెంటనే రక్తం ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదమని తేల్చి చెప్పారు వైద్యులు.
ఇది తెలుసుకున్న మనీశ్... రానాను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మనీష్ రెండేళ్లుగా రక్తం దానం చేయడం చూసిన రానా.. తాను కూడా అదే పని చేసేందుకు కొంచెం కూడా భయపడలేదు.
ఇదీ చదవండి:15 అంతస్తుల భవనంపై 'నడిచొస్తున్న మహాత్ముడు'