ETV Bharat / bharat

యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత - dog showed love on death owner in belagavi

కర్ణాటకలో యజమాని మృతిని తట్టుకోలేక ఓ పెంపుడు కుక్క గుండెపగిలింది. తిండి మానేసింది. వెక్కి వెక్కి ఏడ్చింది. యజమాని కోసం ఊరంతా వెతికింది. తిరిగొస్తాడని వారం రోజుల పాటు ఎదురు చూసింది. చివరికి పుట్టెడు దుఃఖంతో కన్నుమూసింది.

Dog died after the death of its owner in karnataka
యజమాని మృతిని తట్టుకోలేక శునకం కన్నుమూత
author img

By

Published : Sep 15, 2020, 12:22 PM IST

కాసింత ప్రేమ పంచితేనే ఆజన్మాంతం రుణపడిపోతాయి శునాకాలు. యజమానికి విపరీతమైన విశ్వాసాన్ని పంచుతాయి. సరదాకి సున్నితంగా కసిరితేనే చిన్నబోయి ఓ మూల కూర్చుంటాయి. ఇక తననో బిడ్డలా చూసుకున్న యజమాని దూరమైతే..? ఆ వేదన పెంపుడు కుక్కలు భరించగలవా..? నోరు లేని జీవులు తమ బాధను పంచుకోగలవా..? అంతటి శోకాన్ని భరించలేక కర్ణాటకలోని ఓ శునకం కన్నుమూసింది.

యజమాని మృతిని తట్టుకోలేక శునకం కన్నుమూత
Dog died after the death of its owner in karnatakaవిగతజీవియై..

బెలగావి, మూడలగి తాలూకా అవరాది గ్రామానికి చెందిన శంకరప్ప మడివాలా ఓ శునకాన్ని పెంచుకన్నాడు. కడ్డీ అని పేరు పెట్టకుని కన్నబిడ్డలా చూసుకున్నాడు. సెప్టెంబర్ 6న(సోమవారం) హఠాత్తుగా శంకరప్ప మృతిచెందాడు. యజమాని మరణాన్ని దిగమింగలేకపోయింది కడ్డీ. తిండి తిప్పలు మానేసి, శంకరప్ప తిరిగే అన్ని చోట్ల వెతికింది. ఎంతకీ శంకరప్ప జాడలేకపోయేసరికి సెప్టెంబర్ 14న(సోమవారం) మహాలింగపురం గ్రామంలో తుదిశ్వాస విడిచింది కడ్డీ.

Dog died after the death of its owner in karnataka
శంకరప్పతో కడ్డీ

యజమానిపై అంతటి ప్రేమను పెంచుకున్న కడ్డీ మృతి కుటుంబ సభ్యులను మరింత కలచివేసింది. కడ్డీ మృతదేహానికి గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి: కరెంట్​ తీగపై అడుగేసి.. ఉన్నపళంగా కుప్పకూలిపోయి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.