ETV Bharat / bharat

'కరోనా వ్యాప్తికి వర్గాన్ని, ప్రాంతాన్ని కారణంగా చూడకండి' - కరోనా తాజా వార్తలు

కరోనా వ్యాప్తికి దేశంలో ఓ వర్గం, ప్రాంతం కారణమని ఎత్తిచూపొద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. దిల్లీలో నిర్వహించిన తబ్లీగీ ప్రార్థనల కారణంగా దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

Do not label any community or area for spread of COVID-19: Govt
'కరోనా వ్యాప్తికి వర్గాన్ని, ప్రాంతాన్ని కారణంగా చూడకండి'
author img

By

Published : Apr 9, 2020, 5:58 AM IST

దేశంలో కరోనా వ్యాప్తికి ఒక వర్గాన్ని, ప్రాంతాన్ని కారకులుగా ఎత్తిచూపొద్దని ప్రభుత్వం ప్రజలను కోరింది. ఇటీవల తబ్లీగీ జమాత్​ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో ఎక్కువమంది వైరస్​ బారిన పడ్డారు. మహమ్మారి వ్యాప్తి చెందడానికి ఓ వర్గం కారణమని సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

ఇటువంటి పరిస్థితులు దేశంలో గందరగోళం, శత్రుత్వాలను పెంచుతాయని ప్రభుత్వం వివరించింది. కరోనా వ్యాప్తి క్రమంలో ప్రజలు చేయాల్సిన, చేయకూడని వాటి గురించి ఓ జాబితా విడుదల చేసింది. వైద్యులను, పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఎవరూ దురుసుగా ప్రవర్తించొద్దని, వారంతా సాయం చేసేందుకే ఉన్నారని తెలిపింది.

కరోనా సోకిన వ్యక్తులతో పాటు, శానిటరీ వర్కర్లు, ఆరోగ్య సంరక్షకులు, పోలీసులు వైరస్​ వ్యాప్తి విషయంలో వస్తోన్న తప్పుడు సమాచారం కారణంగా వివక్ష ఎదుర్కొంటున్నట్లు వివరించింది. అంతేకాకుండా కరోనా నుంచి కోలుకుంటున్న వారిని కొంతమంది తక్కువగా చూస్తున్నట్లు పేర్కొంది. ఇటువంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ప్రజలను కోరింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.