ETV Bharat / bharat

విమానాల్లో భౌతిక దూరం పాటించరా? - airindia case

విమానాల్లో ప్రయాణికుల్ని పక్కపక్కనే కూర్చోబెడుతుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానయాన సంస్థల ఆదాయం కంటే ప్రయాణికుల ఆరోగ్యం ముఖ్యమని స్పష్టం చేసింది. ప్రత్యేక విమానాల్లో జూన్‌ 6 వరకు జరిగిపోయిన బుకింగ్‌ల వరకు మధ్య సీట్లలో ప్రయాణికుల్ని అనుమతించవచ్చని, ఆ తర్వాత మాత్రం బొంబాయి హైకోర్టు ఆదేశాలకు లోబడి నడుచుకోవాలని ఆదేశించింది.

Do not follow physical distance on planes? supreme court fires on Airlines
విమానాల్లో భౌతిక దూరం పాటించరా?
author img

By

Published : May 26, 2020, 8:32 AM IST

కరోనా నేపథ్యంలో అన్నిచోట్లా భౌతిక దూరం పాటిస్తూ విమానాల్లోపల మాత్రం ప్రయాణికుల్ని పక్కపక్కన ఎలా కూర్చోబెడతారని ఎయిరిండియాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విమానయాన సంస్థల ఆదాయం కంటే ప్రయాణికుల ఆరోగ్యం ముఖ్యమని స్పష్టంచేసింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి రప్పించడానికి ఉపయోగిస్తున్న విమానాల్లో మధ్య సీట్లలోనూ ప్రయాణికుల్ని అనుమతించడాన్ని ఆక్షేపించింది.

ప్రత్యేక విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా విడిచిపెట్టాలని బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం, ఎయిరిండియా.. సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాయి. దీనిని జస్టిస్‌ బోబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ల ధర్మాసనం విచారించి తీర్పు వెలువరించింది. రంజాన్‌ సందర్భంగా న్యాయస్థానానికి సెలవైనా అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. ప్రత్యేక విమానాల్లో జూన్‌ 6 వరకు జరిగిపోయిన బుకింగ్‌ల వరకు మధ్య సీట్లలో ప్రయాణికుల్ని అనుమతించవచ్చని, ఆ తర్వాత మాత్రం బొంబాయి హైకోర్టు ఆదేశాలకు లోబడి నడుచుకోవాలంది.

వైరస్‌కు తెలుస్తుందా?

కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. 'తానొక విమానంలో ఉన్నానని, అక్కడ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తికి కారణం కాకూడదని వైరస్‌కు ఏమైనా తెలుస్తుందా?' అని ప్రశ్నించింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కేంద్రం, ఎయిరిండియాల తరఫున వాదించారు.

ఇదీ చూడండి: క్వారంటైన్​తో తల్లి కడచూపునకు దూరమై..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.