తమిళనాడులో రియల్టర్‌పై డీఎంకే ఎమ్మెల్యే కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. తన స్థలానికి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసేందుకు కుమార్ అనే రియల్టర్ ప్రయత్నించగా అడ్డుకున్న ఎమ్మెల్యే ఇదయవర్మన్ అతడిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ స్థలం ప్రభుత్వ భూమి కావడం సహా స్థానికంగా ఓ ఆలయానికి దగ్గరగా ఉండడంతో స్థానికులు, ఎమ్మెల్యే ఇదయవర్మన్ భూమిని చదును చేయడాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కాల్పులకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే, రియల్టర్ కుమార్ సహా.. మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై అధికార అన్నాడీఎంకే విమర్శలు గుప్పించింది. డీఎంకేలో తుపాకుల సంస్కృతి పెరిగిపోతోందని ఆరోపించింది.
ఇదీ చూడండి: బుధవారం భారత్- చైనా సైనికాధికారుల భేటీ