ETV Bharat / bharat

విడాకులు.. లాక్​డౌన్​.. మళ్లీ పెళ్లి..!

author img

By

Published : May 10, 2020, 6:30 AM IST

Updated : May 10, 2020, 2:20 PM IST

లాక్​డౌన్ వేళ.. భార్యాభర్తలు ఇంటివద్దే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గృహ హింస, ఫ్యామిలీ గొడవల కేసులు పెరిగాయని పలు అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. మధ్యప్రదేశ్​ భోపాల్ ఫ్యామిలీ కోర్టుకూ ఈ మధ్య ఇలాంటి కేసుల తాకిడి ఎక్కువైంది. అయితే ఆ కోర్టు కౌన్సిలర్ వద్దకు అందుకు విరుద్ధమైన కేసు వచ్చింది. విడిపోయిన తన భార్యను మళ్లీ కలవాలనుకుంటున్నట్లు కౌన్సిలర్​ను వేడుకున్నాడు భర్త. పలు ప్రయత్నాల అనంతరం ఆ జంట రెండోసారి పెళ్లి చేసుకుంది.

lockdown marriage
విడాకులు.. లాక్​డౌన్​.. మళ్లీ పెళ్లి..!

'విరిగిన ఆ బౌల్​ని అతికించు.. నా హృదయం కూడా అతుక్కుంటుంది' అంటుంది కథనాయిక. దాన్ని తీసుకెళ్లి చక్కగా అతికించి తెస్తాడు హీరో. అందంగా తీర్చిదిద్దిన ఆ పాత్రని చూపిస్తూ.. 'అతికించిన తర్వాత ఎంత అందంగా తయారయిందో చూశావా.. ప్రేమ బంధం కూడా రెండోసారి కలిస్తే అంతే అందంగా ఉంటుంది' అంటాడు హీరో. ఈ సీన్ ఓ ప్రముఖ తెలుగు సినిమా లోనిది. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో జరిగింది. ఇద్దరి మధ్య గొడవలతో విడాకులు తీసుకుని వేరైపోయిన ఓ జంట.. మరోసారి ఒక్కటయ్యింది. తప్పులను దిద్దుకుని కలిసి నడుద్దామంటూ రెండున్నర ఏళ్ల తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ఇదీ జరిగింది..

భోపాల్​ నగరం.. కోలార్​ ప్రాంతానికి చెందిన ఓ జంట రెండున్నర ఏళ్ల క్రితం.. ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కలిసి ఉండలేమంటూ విడిపోయింది. నాడు వారికి సంవత్సరం ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉంది. అయితే ప్రస్తుత లాక్​డౌన్​ కాలంలో తన జీవితాన్ని సమీక్షించుకున్నాడు భర్త. భార్య, బిడ్డలు లేకుండా జీవితం దుర్భరమైపోయిందని భావించాడు. వెంటనే నాడు కలిసి ఉండాలని ఎంతో కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారికి ఫోన్ చేసి.. విషయం చెప్పారు. ఆ కౌన్సిలర్ విడిపోయిన దంపతులిద్దరూ వీడియో కాల్​ ద్వారా మాట్లాడుకునే ఏర్పాటు చేశాడు. అయితే పునర్వివాహానికి మొదట నిరాకరించింది ఆ యువతి. కానీ ఇరుగుపొరుగు వారి సలహాతో రెండోసారి వివాహానికి సిద్ధమయింది. పెళ్లి బంధంతో ఇరువురు మరోసారి ఒక్కటయ్యారు.

లాక్​డౌన్ వేళ..

కుటుంబ న్యాయస్థానంలో గృహ హింస కేసులు ఎక్కువగా వస్తాయని.. అయితే ప్రస్తుత లాక్‌డౌన్ వేళ ఇలా పాత బంధాలు కలిపే కేసులు కూడా వస్తున్నాయని చెప్పారు భోపాల్ ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్. ఇలా విడిపోయిన బంధాలు ఒక్కటవ్వడం ఇదే మొదటిసారి కాదని తెలిపారు. ఇంతకుముందు కూడా విడాకులు తీసుకున్నవారు కలుసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: హనీమూన్​కు వెళ్లాల్సిన నవజంటకు క్వారంటైన్​!

Last Updated : May 10, 2020, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.