ETV Bharat / bharat

పదవీ విరమణ రోజున కార్యాలయంలోనే డీజీపీ నిద్ర

ఐపీఎస్​ అధికారిగా 35 ఏళ్ల పాటు సేవలందించిన కేరళలోని డీజీపీ జాకోబ్​ థామస్​.. తన పదవీ విరమణ రోజున కార్యాలయంలోనే నిద్రపోయారు. ఇందుకు సంబంధించి.. దుప్పటి, తలగడ ఉన్న ఓ ఫొటోను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.

author img

By

Published : Jun 1, 2020, 4:06 PM IST

DGP Jacob Thomas spends night in office on last day of service
పదవీ విరమణ రోజు కార్యాలయంలోనే డీజీపీ నిద్ర

పదవీ విరమణ సమయంలో సాధారణంగా అధికారులు భావోద్వేగానికి లోనవుతారు. కొంతమంది వీడ్కోలు వేడుకలు జరుపుకుని.. ఉద్వేగంగా ప్రసంగిస్తారు. అయితే కేరళకు చెందిన సీనియర్​ ఐపీఎస్​ ఆఫీసర్​ డీజీపీ జాకోబ్​ థామస్​ మాత్రం.. తన పదవీ విరమణ రోజు కార్యాలయంలోనే నిద్రపోయారు. దుప్పటి, దిండు ఉన్న ఓ ఫొటోను ఆయనే స్వయంగా ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

DGP Jacob Thomas spends night in office on last day of service
డీజీపీ జాకోబ్​ పోస్ట్​

ఎన్నో విభేదాలు...

1985 ఐపీఎస్​ బ్యాచ్​కు చెందిన థామస్​.. 35 ఏళ్ల పాటు సర్వీసులో ఉన్నారు​. అయితే ప్రభుత్వంతో ఆయనకు ఎన్నో విభేదాలు ఉన్నట్టు చాలా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రెండేళ్ల పాటు సస్పెన్షన్​ను కూడా ఎదుర్కొన్నారు. గత ఏడాది డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.

అయితే తన తదుపరి కార్యచరణపై ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు థామస్​. విద్యా పరిశోధన కార్యకలాపాలతో పాటు రాజకీయ విశ్లేషకుడిగా పనిచేసేందుకు థామస్​ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

థామస్​ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. గతేడాది జరిగిన లోక్​సభ ఎన్నికల్లో చాలకుడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతారని పెద్ద ఎత్తున వదంతులు వచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.