ETV Bharat / bharat

వర్షాకాలంలో కోజికోడ్​ విమానాశ్రయం మూసివేత - డీజీసీఏ

వర్షాకాలంలో కోజికోడ్​ విమానాశ్రయాన్ని మూసివేయాలని నిర్ణయించింది డీజీసీఏ. ఈ నెల 7న జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

DGCA decides to close Kozikode Airport in monsoon
కోజికోడ్​ విమానాశ్రయంపై డీజీసీఏ కీలక నిర్ణయం
author img

By

Published : Aug 11, 2020, 10:55 PM IST

కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో ఇటీవల చోటుచేసుకున్న విమాన ప్రమాద ఘటనతో పౌర విమానయానశాఖ మరింత అప్రమత్తమైంది. ఈ మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వర్షా కాలం మొత్తం కొజికోడ్‌ విమానాశ్రయాన్ని మూసివేయాలని నిర్ణయించినట్టు డీజీసీఏ వెల్లడించింది.

మరోవైపు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలపై తనిఖీలు నిర్వహించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు అధిక వర్షాలు కురిసే విమానాశ్రయాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​ తెలిపింది.

ఈ నెల 7న దుబాయి నుంచి కొజికోడ్‌ విమానాశ్రయానికి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వే పైనుంచి జారిపడి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదం పెను విషాదం నింపింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా.. 140మందికి పైగా క్షతగాత్రులైన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.