ETV Bharat / bharat

వారికన్నా 24 ఏళ్ల సీనియర్​- మళ్లీ పెద్దల సభకు దేవెగౌడ! - రాజ్యసభకు దేవెగౌడ నామినేషన్​

మాజీ ప్రధాని, జేడీఎస్ దళపతి దేవెగౌడ రాజ్యసభ ఎన్నికలకు నామపత్రం దాఖలు చేశారు. జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే దేవెగౌడ రెండోసారి రాజ్యసభలో అడుగుపెడతారు. రాజ్యసభ అభ్యర్థి సగటు వయసు కన్నా దేవెగౌడ వయసు 24 ఏళ్లు ఎక్కువ.

Deve Gowda files nomination for RS polls
నామినేషన్ దాఖలు చేసిన మాజీ ప్రధాని దేవెగౌడ
author img

By

Published : Jun 9, 2020, 5:22 PM IST

రాజ్యసభ ఎన్నికల కోసం మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్​డీ దేవెగౌడ నామపత్రం దాఖలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్న, ఇతర జేడీఎస్ నేతలతో కలిసి బెంగళూరులోని విధాన సౌధలో శాసనసభ కార్యదర్శికి ఆయన నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

Deve Gowda
నామినేషన్ దాఖలు చేసిన మాజీ ప్రధాని దేవెగౌడ

కర్ణాటకలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు స్థానాలకు గానూ భాజపా రెండు, కాంగ్రెస్ ఒక స్థానానికి ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి.

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు జాతీయ నాయకుల అభ్యర్థన మేరకు దేవెగౌడ ఎన్నికల బరిలో నిలిచినట్లు కుమారస్వామి తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే దేవెగౌడ రెండోసారి రాజ్యసభలో అడుగుపెడతారు.

Deve Gowda
దేవెగౌడ

2019 లోక్​సభ ఎన్నికల్లో తుమ​కూరు స్థానంలో పోటీ చేసి దేవెగౌడ ఓటమిపాలయ్యారు.

24 ఏళ్లు పెద్ద...

రాజ్యసభ సభ్యుల సగటు వయసు 63 ఏళ్లు. దేవెగౌడ (87)కు వయసు అంతకన్నా 24 ఏళ్లు ఎక్కువ. ఈ విషయంపై దేవెగౌడ 'ఈటీవీ భారత్'​తో మాట్లాడారు. వయసు ఎక్కువైనా... ప్రజలకు సేవ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

"లౌకిక పార్టీలతో పాటు కర్ణాటక భాజపా కూడా నా నామినేషన్​కు మద్దతు పలికింది. పెద్దల సభ దృష్టికి అన్ని సమస్యలు తీసుకువెళ్లడానికి నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను."

- హెచ్​డీ దేవెగౌడ, మాజీ ప్రధాని

భాజపా అభ్యర్థులు...

రాజ్యసభ ఎన్నికలకు భాజపా తరఫున రాష్ట్రం నుంచి ఈరన్న కదాడీ, అశోక్​ గస్తీ నామపత్రాలు దాఖలు చేశారు. రాష్ట్ర భాజపా యూనిట్​ ప్రతిపాదించిన పేర్లను కాదని అధిష్ఠానం వీరిని బరిలోకి దింపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.