ETV Bharat / bharat

బిహార్​ బరి: వారసుల సమరంతో రసవత్తరంగా రణం - బిహార్​ పోల్స్​

ఈ ఏడాది బిహార్​ ఎన్నికల్లో బరిలోకి దిగిన వారిలో యువతరం అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దిగ్గజ నేతల వారసులు పోటీలో నిలవటం వల్ల ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. తమ తండ్రుల నుంచి రాజకీయ వారసత్వాన్ని స్వీకరించిన వీరంతా.. రాజకీయ రణరంగంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీపడుతున్నారో చూద్దామా..

Bihar Assembly elections
బిహార్​ ఎన్నికల్లోవారసుల సమరం
author img

By

Published : Oct 22, 2020, 5:54 PM IST

Updated : Oct 22, 2020, 6:24 PM IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎందరో వారసులు బరిలో దిగారు. తమ తండ్రుల నుంచి రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న వీరంతా పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో దిగ్గజ నేతలు మొదలుకొని గతంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకుల వారసులూ ఉన్నారు.

బిహార్‌లో రాజకీయ వారసులనగానే అత్యంత కీలకమైన ఇద్దరు యువనేతల పేర్లే ముందుంటాయి. వారే తేజస్వీ యాదవ్, చిరాగ్‌ పాసవాన్​. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్‌ తనయుడు తేజస్వీ.. పార్టీ భారమంతా భుజాన వేసుకుని నడిపిస్తున్నారు. అలాగే దళిత దిగ్గజ నేత, జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించిన దివంగత రాంవిలాస్‌ పాసవాన్​ కుమారుడు, లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్​ అన్నీ తానే అయి ఎన్నికల్లో పనిచేస్తున్నారు. ఈసారి ఇద్దరూ తమ తండ్రుల సాయం లేకుండానే బరిలోకి దిగారు. ఇద్దరి లక్ష్యం ప్రధానంగా జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమారే. వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులు, బంధువుల్లో కొందరు బరిలో ఉన్నారు.

జైలులో లాలూ..

లాలూ ప్రసాద్‌ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్‌ 5 పార్టీలతో కూడిన మహాకూటమిని నడిపిస్తున్నారు. రెండేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన.. రాజకీయాల్లో ఆరితేరిన లాలూప్రసాద్‌ సాయం లేకుండా తొలిసారి ఒంటరిగా పోరాడుతున్నారు. పశుగ్రాసం కుంభకోణంలో శిక్ష పడిన లాలూ రాంచీ జైలులో ఉన్నారు. బిహార్‌లో గట్టి పట్టున్న యాదవ్‌ సామాజికవర్గ ఓట్లపైనే తేజస్వీ ఆశలు పెట్టుకున్నారు. పలు నియోజకవర్గాల్లో ఈ సామాజిక వర్గ అభ్యర్థులు కీలకంగానే ఉన్నారు.

విషాదాన్ని దిగమింగుకుంటూ..

కేంద్ర మంత్రిగా పనిచేస్తూ కొద్ది రోజుల క్రితం రాంవిలాస్‌ పాసవాన్​ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషాదాన్ని దిగమింగుకుంటూనే ఆయన తనయుడు, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌ ఎన్నికల బరిలో తలపడతున్నారు. బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకొచ్చిన చిరాగ్, ముఖ్యమంత్రి నీతీశ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీకి తాను వీర విధేయుడినని చెబుతున్నారు. ఎన్‌డీఏలో జేడీయూతో పాటు కీలక భాగస్వామ్యం వహిస్తున్న భాజపాతో చిరాగ్‌ పాసవాన్​ లోపాయికారీ సంబంధాలున్నట్లు ఊహాగానాలు వినిపించినా భాజపా అగ్రనేతలు మాత్రం దీన్ని తోసిపుచ్చారు.

బిహార్‌లో ఈసారి పోటీ చేస్తున్న వారసులు..

  • ఆర్జేడీ: మహువా సిట్టింగ్‌ ఎమ్మెల్యే, తేజస్వీ అన్న తేజ్‌ప్రతాప్‌ హసన్‌పుర్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు శివానంద్‌ తివారీ కుమారుడు రాహుల్‌ తివారీ, పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు జగదానంద్‌ సింగ్‌ తనయుడు సుధాకర్‌ సింగ్, కేంద్ర మాజీ మంత్రి కాంతి సింగ్‌ కుమారుడు రుషీ సింగ్, మాజీ ఎంపీ ప్రభునాథ్‌ సింగ్‌ తనయుడు రణ్‌ధీర్‌ సింగ్‌ కూడా అభ్యర్థులుగా ఉన్నారు. లాలూకు సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి జయప్రకాశ్‌ నారాయణ్‌ యాదవ్‌.. తన కుమార్తె దివ్యప్రకాశ్‌కు, సోదరుడు విజయ్‌ప్రకాశ్‌కు టిక్కెట్లు ఇప్పించున్నారు.
  • భాజపా: విజయ్‌ప్రకాశ్‌కు ప్రధాన ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్న భాజపా అభ్యర్థి, ప్రముఖ కామన్వెల్త్‌ క్రీడాకారిణి శ్రేయసీ సింగ్‌.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత దిగ్విజయ్‌ సింగ్‌ కుమార్తె. మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత నవీన్‌ కిశోర్‌ ప్రసాద్‌ సిన్హా కుమారుడు నితిన్‌ నబిన్‌ కూడా బరిలోకి దిగుతున్నారు.
  • జేడీయూ: ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ తన కుటుంబ సభ్యులెవరినీ బరిలోకి దించనప్పటికీ తన అనుయాయులైన నేతల పిల్లలకు జేడీయూ టిక్కెట్లు ఇచ్చారు. ఇలా బరిలోకి దిగిన వారిలో మాజీ ఎంపీ జగదీశ్‌ శర్మ కుమారుడు రాహుల్‌ కుమార్, సిటింగ్‌ ఎమ్మెల్యే మహీంద్ర కుమార్‌ మండల్‌ కుమారుడు నిఖిల్‌ మండల్, రాష్ట్ర మాజీ మంత్రి, దివంగత కపిల్‌దేవ్‌ కామత్‌ కోడలు మీనా కామత్‌ ఉన్నారు. హరియాణా గవర్నర్‌ సత్య నారాయణ్‌ ఆర్య కుమారుడు కౌశల్‌ కిశోర్‌కు కూడా జేడీయూ టిక్కెట్‌ ఇచ్చింది.
  • కాంగ్రెస్‌: సీట్ల సర్దుబాటులో భాగంగా మహాకూటమిలో 70 సీట్లకు తలపడుతున్న కాంగ్రెస్‌.. బాలీవుడ్‌ నటుడు - రాజకీయ నాయకుడు శతృఘ్న సిన్హా కుమారుడు లవ్‌ సిన్హా, పార్టీ శాసనసభా పక్షనేత సదానంద్‌ సింగ్‌ కుమారుడు సుభానంద్‌ ముఖేశ్‌లకు టిక్కెట్లు ఇచ్చింది. అలాగే సోషలిస్ట్‌ సీనియర్‌ నేత శరద్‌ యాదవ్‌ కుమార్తె సుభాషిణి యాదవ్‌ కుడా బరిలో ఉన్నారు.
  • ఎల్‌జేపీ: చిరాగ్‌ పాసవాన్​ తన సమీప బంధువు కృష్ణరాజ్‌కు రోసెరా టిక్కెట్‌ కేటాయించారు.

ఇదీ చూడండి: నితీశ్‌ ప్రచార సభలో 'లాలూ జిందాబాద్‌'..!

Last Updated : Oct 22, 2020, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.