ETV Bharat / bharat

నిండు గర్భిణికి ప్రసవం చేసిన దంత వైద్యురాలు

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కట్టుదిట్టంగా అమలు జరుగుతున్నందున ప్రజా రవాణా స్థంభించింది. దీనివల్ల ఓ నిండు గర్భిణి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే.. ఓ దంత వైద్యురాలు గైనకాలజిస్టుగా మారి ఆమెకు ప్రసవం చేసింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

Dentist become a Gynecologist in Bangalore
నిండు గర్భిణికి ప్రసవం చేసిన దంత వైద్యురాలు
author img

By

Published : Apr 20, 2020, 8:14 AM IST

కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమల్లో ఉంది. ఈ తరుణంలో దాదాపు అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. దీని వల్ల బెంగళూరులో ఓ నిండు గర్భిణి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమెకు ఓ దంత వైద్యురాలు ప్రసవం చేయగా.. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు.

Dentist become a Gynecologist in Bangalore
నిండు గర్భిణికి ప్రసవం చేసిన దంత వైద్యురాలు

ఏడు కిలోమీటర్లు నడక

మధ్యప్రదేశ్​కు చెందిన దంపతులు రోజువారీ కూలీ పని చేస్తూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. డెలివరీ సమయం దగ్గర పడటం వల్ల గర్భిణి శాంతి.. ఆస్పత్రికి చేరుకునేందుకు ఆమె భర్తతో కలిసి సుమారు 7 కిలోమీటర్లు నడిచింది. ఒక ఆస్పత్రికి వెళ్లగా అక్కడి దంత వైద్యురాలే ఆమెకు ప్రసవం చేసింది. ప్రసవం తర్వాత మహిళకు అధిక రక్తస్రావం కావడం వల్ల డాక్టర్​ రమ్య, సిబ్బంది ఆమెకు తాత్కాలిక చికిత్స చేసి అంబులెన్స్​లో కేసీ జనరల్​ ఆస్పత్రికి తరలించారు.

" నెలలు నిండిన శాంతి.. క్లినిక్​ లేదా ఏదైనా ఆస్పత్రి తెరిచి ఉంటుందని సుమారు 5 నుంచి 7 కిలోమీటర్లు నడిచి వచ్చింది. దీని వల్ల నేను ఆమెకు ప్రసవం చేశా. అయితే పుట్టిన వెంటనే బిడ్డ స్పందించలేదు. చనిపోయిందని అనుకున్నాం. చివరికి బిడ్డ అరవడం వల్ల అందరం ఊపిరి పీల్చుకున్నాం."

-- డాక్టర్ రమ్య, దంత వైద్యురాలు

ఇదీ చదవండి: ఆ ఆసుపత్రిలో 21 మంది వైద్య సిబ్బందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.