ETV Bharat / bharat

చివరి చూపు లేనే లేదు.. ఇదేం అంతిమ'సంస్కారం'?

బతికినంత కాలం ఎలా బతికినా.. పోయినప్పుడు మాత్రం పార్థివ దేహానికి బంధుమిత్రుల సమక్షంలో గౌరవంగా అంత్యేష్టి (అంతిమసంస్కారాలు) జరిపిస్తారు. ఇది ఆ వ్యక్తికి ఇచ్చే కనీసం గౌరవం. అయితే ఇప్పుడు అంతా తారుమారైంది. చనిపోయినవారిని కడసారి చూసేందుకు ఆంక్షలు అడ్డొస్తున్నాయి. కరోనా దెబ్బకు శ్మశానాలకు మృతదేహాలు క్యూకడుతున్నాయి. అసలేం జరుగుతోంది?

Delhi's crematoriums
చివరి చూపు కూడా లేదు.. ఇదేం అంతిమ'సంస్కారం'?
author img

By

Published : Jun 13, 2020, 9:40 AM IST

Updated : Jun 13, 2020, 9:46 AM IST

చివరి చూపు కూడా లేదు.. ఇదేం అంతిమ'సంస్కారం'?

చైనాలో రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు వస్తుంటే 'రోజూ ఇదే వార్తా?' అనుకున్నాం. ఇటలీలో కరోనా మృతదేహాలను పూడ్చేందుకు ఖాళీ లేదు అని తెలిసినప్పుడు 'అయ్యో' అనుకున్నాం. మరి ఇప్పుడు భారత్​లో ఇదే జరుగుతుంటే పంటి బిగువున బాధను.. కంటి చివర కన్నీళ్లను ఆపుకుంటున్నాం. వేల సంఖ్యలో కేసులు.. వందల సంఖ్యలో మృతులు.. ఇది దేశ పరిస్థితి. మరి ఆ మృతదేహాలను ఏం చేస్తున్నారు? దహనసంస్కారాలు ఎలా జరుగుతున్నాయి?

దేశ రాజధాని దిల్లీలో 67 ఏళ్ల మనీశ్​ తల్లి కరోనా లక్షణాలతో చనిపోయారు. హిందూ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా దహనసంస్కారాలు చేసేందుకు సిద్ధమయ్యాడు.

అయితే ఇందుకు విరుద్ధంగా తన తల్లి మృతదేహం కట్టెలపై కాలుతుంటే నిస్సహాయ స్థితిలో నిల్చొని చూస్తుండిపోయాడు.

Delhi
అంతిమసంస్కారం

"ఇక్కడ నాతో పాటు కనీసం 1000 మంది ఉండేవారు. నాది చాలా పెద్ద కుటుంబం. కానీ కరోనా కారణంగా నేనెవర్నీ పిలవలేకపోయాను. ఇంట్లో వాళ్లను కూడా పిలవలేదు."

- మనీశ్​ గార్గ్​

ఇప్పటికీ ఆయన తన తల్లి కరోనా పరీక్ష రిపోర్ట్​ కోసం ఎదురుచూస్తున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నట్టే దిల్లీలోనూ కరోనా మృతుల అంతిమసంస్కారాలు హడావుడిగా జరుగుతున్నాయి. మృతుల కుటుంబాలకు ఉండే ఎలాంటి సంప్రదాయాలకు ఇక్కడ చోటు లేదు.

Delhi
కరోనా మృతదేహానికి అంతిమసంస్కారం

దిల్లీలో ఏం జరుగుతోంది?

శ్మశానాలు కరోనా శవాలతో నిండిపోతున్నాయి. దహనసంస్కారాలు చేయడానికి కూడా సమయం లేదు. అందులోనూ అంతిమయాత్రలో పాల్గొనే వారి సంఖ్యపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేసింది.

దిల్లీలో కరోనా మరణాలపై ప్రభుత్వం చెప్పే గణాంకాలతో పోలిస్తే నగరంలోని శ్మశానాలు చెప్పే లెక్కలు చాలా ఎక్కువ. ఆసుపత్రుల శవాగారాలు నిండిపోయాయి. కొన్ని శవాలను మంచుదిమ్మలపై పడుకోబెట్టారు.

Delhi
మృతదేహాన్నిదహనసంస్కారాలకు తీసుకువెళ్తున్న సిబ్బంది

ఒకేసారి పెరిగాయి...

రోజూ దేశంలో సగటున 10 వేలకు పైగా కేసులు, 275 మరణాలు నమోదవుతున్నాయి. 10 వారాల లాక్​డౌన్​ తర్వాత జూన్​ 8 నుంచి ఆంక్షలను సడలించింది ప్రభుత్వం. లాక్​డౌన్​ ఆంక్షలు సడలించిన రోజే మునపటి రికార్డ్​ను చెరిపేస్తూ ఒక్కరోజులో అత్యధిక మరణాలు సంభవించాయి.

దిల్లీలోని ఆరోగ్య కేంద్రాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం వేల సంఖ్యలో ఉన్న కేసులు జులై చివరి నాటికి 5 లక్షల 50 వేలకు చేరతాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ అంచనా వేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టే భారత్​లోనూ ప్రభుత్వ లెక్కలకు, వాస్తవాలకు చాలా దూరం ఉంది. దీనికి పరిమిత సంఖ్యలో పరీక్షలు కూడా ఒక కారణం.

500కు పైగా...

దిల్లీలోని నిగంబోధ్​ శ్మశానవాటిక ఇప్పటివరకు 500కుపైగా కరోనా మృతదేహాలకు అంతిమసంస్కారులు నిర్వహించింది. కొన్ని దహనయంత్రాలు పనిచేయడం మానేశాయి, వాటిని ఎవరూ రిపైర్​ కూడా చేయడం లేదు. ఇక సిబ్బంది కట్టెలపైనే శవాలను కాలుస్తున్నారు.

పనికాలం పెంచినప్పటికీ ఒక్కొక్క శవానికి శాస్త్రోక్తంగా దహనసంస్కారాలు చేసేంత సమయం లేదు.

ముస్లింల పరిస్థితి ఇంతే!

నగరంలో ముస్లింల అంతిమసంస్కారాలు కూడా పెరిగాయి. వీరి ఆచారం ప్రకారం శశ్మానవాటికలో మృతదేహాన్ని దించేలోపు శుభ్రం చేస్తారు. అంతిమయాత్రలో పాల్గొన్నవారు కడసారి చనిపోయిన వారి ముఖాన్ని చూస్తారు. మతపెద్దలు చిన్న ప్రబోధం చేస్తారు. అప్పుడు కుటుంబీకులు ఆ మృతదేహాన్ని పూడ్చిపెడతారు.

Delhi
కరోనా మృతదేహాన్ని పూడుస్తోన్న సిబ్బంది

అయితే ఇప్పుడు ఇవేమీ లేవు. హజ్​మట్​ సూట్లలో సిబ్బంది... మృతదేహాలను తీసుకువచ్చి.. కుటుంబీకులు చూసే వీలు లేకుండా అప్పటికే వస్త్రాల్లో చుట్టి ఉన్న శవాన్ని పూడ్చేస్తున్నారు. ఎలాంటి ప్రబోధాలు లేవు. చాలామంది ఆ మృతదేహాలను కనీసం ముట్టుకోవడానికి ఇష్టపడటం లేదు.

దిల్లీలోని అతిపెద్ద ముస్లింల శ్మశానవాటికలో పరిస్థితి ఇది. ఇప్పటివరకు ఇక్కడ 200కు పైగా కొవిడ్​ మృతదేహాలను పూడ్చారు. ఇక్కడ వీరికి కేటాయించిన స్థలం కూడా తగ్గిపోతోంది.

జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఓ వ్యక్తి మరణానంతరం వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేది అంతిమసంస్కారం. కరోనా దెబ్బకు వీటికీ తిలోదకాలు పలుకుతున్నారు.

Last Updated : Jun 13, 2020, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.