గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీసులకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో చర్యలకు ఉపక్రమించింది పోలీసు విభాగం. విధ్వంసకారులను గుర్తించడంపై దృష్టి సారించింది. ఈ మేరకు రైతు సంఘాల నాయకులు యోగేంద్ర యాదవ్, బల్బీర్ సింగ్ రజేవాల్ సహా 20 మంది రైతు నేతలకు లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది.
దిల్లీ ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని స్పష్టం చేశారు పోలీసులు. లుక్అవుట్ నోటీసులపై మూడు రోజుల్లోగా స్పందన తెలియజేయాలని కోరారు.
అలాగే.. ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న రైతులకూ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. విధ్వంసకారులు దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు చర్యలు ప్రారంభించారు. నిందితుల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకునేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. అటు ఎర్రకోటతో సహా దిల్లీ సరిహద్దుల్లో పటిష్ఠ బందోబస్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి:హింసలో నా ప్రమేయం లేదు: లఖా సిధానా