ETV Bharat / bharat

తాతయ్య 100వ పుట్టినరోజు.. పోలీసులే అతిథులు - ఫ్రెండ్లీ పోలీసింగ్​ విధానం

లాక్​డౌన్​ వేళ ప్రజలకు సేవచేయడంలో అత్యవసర సేవల విభాగం ముందుంటోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్​ విధానాన్ని అమలు చేస్తున్న రక్షణ విభాగం ఈ ఆపత్కాలంలో ప్రజలకు అండగా మేమున్నామంటూ సందేశమిస్తోంది. తాజాగా తన తండ్రి వందో పుట్టినరోజు ఏర్పాట్ల కోసం అనుమతి ఇవ్వాలంటూ దిల్లీలో ఓ మహిళ దరఖాస్తుకు ఆశ్చర్యపరిచే రీతిలో స్పందించారు పోలీసులు. అవసరమైనవి సమకూర్చడమే కాదు.. పుట్టినరోజు వేడుకలకు హాజరై పెద్దాయనను ఆనందంలో ముంచెత్తారు.

Delhi Police helps man to celebrate his 100th birthday
వందో పుట్టినరోజు వేళ.. ఆ ఇంటికి అనుకోని అతిథులు!
author img

By

Published : May 3, 2020, 6:20 AM IST

Updated : May 3, 2020, 7:08 AM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడమే కాదు.. అవసరమైన వారికి సేవలు చేయడంలోనూ పోలీసులు ముందుంటున్నారు. ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్న రక్షణసిబ్బంది.. లాక్​డౌన్​ వేళ ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఔషధాలు అందించడం, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు చేయూత అందించడం సహా.. వివిధ రకాల సాయం చేయడంలో ముందుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే దిల్లీలో జరిగింది. ఓ వృద్ధుడి 100వ పుట్టినరోజుకు ఏర్పాట్లు చేశారు.

వందో పుట్టినరోజు వేళ.. ఆ ఇంటికి అనుకోని అతిథులు!

ఇదీ జరిగింది..

తన తండ్రి వందో పుట్టినరోజును జరుపుకోవాలని అనుకుంటున్నామని.. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవటానికి అనుమతి పత్రం జారీ చేయాలని దిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకుంది ఓ మహిళ. ఈ అంశం ఈశాన్య దిల్లీ డీసీపీ విజయాంత ఆర్య దృష్టికి వెళ్లింది. ఆ కుటుంబానికి సహాయం చేయమని పోలీసులను ఆదేశించారు డీసీపీ. ఈ నేపథ్యంలో పుట్టినరోజు ఏర్పాట్లకు సహకరించారు పోలీసులు.

పోలీసులే అతిథులుగా..

అనంతరం డీసీపీ విజయాంత ఆర్య సూచనల మేరకు ఎస్​ఐ​ అమిత్​కుమార్​ బర్త్​డే కేకుతో వారి ఇంటికి వెళ్లారు. పోలీస్​ సిబ్బంది కేకుతో రావటంపై ఆ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వందో పుట్టిన రోజు జరుపుకునేందుకు సహకరించిన డీసీపీకి వీడియో కాల్​ చేసి కృతజ్ఞతలు తెలియజేశారు కుటుంబసభ్యులు.

Last Updated : May 3, 2020, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.