ETV Bharat / bharat

'రెండోసారీ కరోనా కొమ్ములు వంచిన దిల్లీ' - Fight against Coronavirus

దేశ రాజధానిలో కొవిడ్​ కేసుల రెండో గరిష్ఠ స్థాయి(పీక్​)ని కూడా దాటేశామని ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ తెలిపారు. సెప్టెంబర్​ 17 నుంచి సోమవారం వరకు కరోనా డేటాను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోందని వివరించారు.

Delhi past peak of 2nd COVID-19 wave: CM Kejriwal
'దిల్లీలో కరోనా పంజాని నియంత్రించగలిగాం'
author img

By

Published : Oct 6, 2020, 7:51 PM IST

కరోనా వ్యాప్తిలో రెండో గరిష్ఠ స్థాయినీ అధిగమించామని ప్రకటించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. సెప్టెంబర్​ మూడో వారంలో పాజిటివ్​ కేసుల సంఖ్య అమాంతం పెరగగా.... ప్రస్తుతం ఆలాంటి పరిస్థితి లేదని స్పష్టంచేశారు.

"సెప్టెంబర్​లో కొవిడ్​ కేసుల గరిష్ఠ స్థాయిని దాటాం. ప్రస్తుతం పాజిటివ్​ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వైరస్​ నియంత్రణకు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నాం. పది వేలకు పైగా పడకలు ఖాళీగా ఉన్నాయి. "

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

ఏంటీ రెండో గరిష్ఠ స్థాయి?

కొద్ది నెలల క్రితం దిల్లీలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది. తర్వాత క్రమంగా తగ్గాయి. అయితే ఆగస్టు 17 నుంచి వైరస్​ మళ్లీ విజృంభించడం ప్రారంభించింది. సెప్టెంబర్​ 17న ఒక్క రోజే ఏకంగా 4,473 కేసులు నమోదయ్యాయి. తర్వాత రోజు నుంచి కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా తగ్గడం మొదలైంది.

సోమవారం దిల్లీలో నిర్వహించిన పరీక్షల్లో 1,947 కొత్త కేసులను అధికారులు గుర్తించారు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 92 వేల 560కి చేరింది. మరో 32 మంది మృతి చెందగా మరణాల సంఖ్య 5 వేల 542కు పెరిగింది. పాజిటివ్​ రేటు 8.82 గా ఉండగా.. మరణాల రేటు 1.41గా ఉంది.

కరోనా వ్యాప్తిలో రెండో గరిష్ఠస్థాయినీ అధిగమించామని ప్రకటించిన తొలి రాష్ట్రం దిల్లీనే కావడం గమనార్హం.

ఇదీ చూడండి: దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 61 వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.