పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని జాఫ్రాబాద్‌లో జరుగుతున్న నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. సీఏఏ వ్యతిరేకులు, అనుకూలురు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ ప్రవేశద్వారాలను అధికారులు మూసేశారు.
జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ వద్ద 500 మంది పౌరచట్టానికి వ్యతిరేకంగా అర్ధరాత్రి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలకు మహిళలు ఎక్కువగా హాజరయ్యారు. సీఏఏను ఉపసంహరించే వరకు ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లమని నినాదాలు చేస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో... ఆ ప్రాంతంలో భారీగా భద్రత బలగాలను మోహరించినప్పటికీ హింస చెలరేగింది. షాహీన్‌భాగ్ నిరసనకారులు మూసివేసిన రహదారిని తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నవేళ... ఈ నిరసనలు చోటుచేసుకోవడం గమనార్హం.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: ఆతిథ్యానికి సర్వం సిద్ధం- భద్రత కట్టుదిట్టం