నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా క్షమాభిక్ష అర్జీని తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం సిఫార్సు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి పిటిషన్ అందిన కొద్ది సేపటికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ పిటిషన్ దిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వద్దకు చేరింది.
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు ముడోసారి వాయిదా పడింది. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా రాష్ట్రపతికి చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ తేలేవరకు మరణదండనను అమలు చేయరాదని దిల్లీ కోర్టు నిన్న తెలిపింది.
మార్చి 3న ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులను ఉరితీయాల్సి ఉంది.