కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది దిల్లీ సర్కారు. బార్లు, హోటళ్లు, క్లబ్బులను తెరిచేందుకు అనుమతించింది. జులై 15తో గడువు తీరిపోనున్న బీర్లను అమ్మేందుకే బార్లను తెరవాలని సంకల్పించింది.
దిల్లీ వ్యాప్తంగా 950 హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్-బార్లు ఉన్నాయి. వాటికి లైసెన్సులు ఉన్నప్పటికీ మార్చి 25న లాక్డౌన్ విధింపు నాటి నుంచి తెరిచేందుకు అనుమతించడం లేదు.
"రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు, క్లబ్బులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. జులై 15తో గడువు తీరిపోయే బీర్లను అమ్మేందుకే ఈ నిర్ణయం తీసుకుంది."
-అధికారుల ప్రకటన
ఇదీ చూడండి: 'చైనా విరాళాలను మోదీ ఎందుకు స్వీకరిస్తున్నారు?'