ETV Bharat / bharat

మోదీజీ... వారిని అసలు విడిచిపెట్టొద్దు: కేజ్రీవాల్ - modi kejriwal meeting

దిల్లీలో హింసను సృష్టించినవారు ఏ పార్టీకి చెందినవారైనా విడిచిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీని కోరారు దిల్లీ సీఎం కేజ్రీవాల్. ఇలాంటి అల్లర్లు పునరావృతం కాకుండా చూడాలని ప్రధానిని అభ్యర్థించారు. కరోనా వైరస్​ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీతో చర్చించారు కేజ్రీవాల్.

Delhi CM Kejriwal to meet PM Modi today
మోదీజీ... వారిని అసలు విడిచిపెట్టొద్దు: కేజ్రీవాల్
author img

By

Published : Mar 3, 2020, 6:03 PM IST

'హింసాత్మక అల్లర్లకు పాల్పడినవారు ఏ పార్టీకి చెందినవారైనా సరే వారిని విడిచిపెట్టొద్దు' అని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్. హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ఈశాన్య దిల్లీ గురించి మోదీతో చర్చించారు ఆయన. పోలీసులు ఎంతో శ్రమించి పిరిస్థితిని అదుపులోకి తెచ్చారని కొనియాడారు.

దిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చాక తొలిసారి మోదీతో భేటీ అయ్యారు కేజ్రీవాల్​. వేర్వేరు అంశాలపై దాదాపు గంటన్నరపాటు మాట్లాడారు. దిల్లీలో హింస, దేశంలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్​ను తరిమికొట్టే చర్యలపై చర్చలు జరిపారు.

'దేశ రాజధానిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మోదీని అభ్యర్థించాను. అల్లర్లకు కారకులైనవారిని పార్టీతో సంబంధం లేకుండా శిక్షించాలని కోరాను.'

-అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ సీఎం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.