ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: పోలింగ్​ సమాప్తం- ఫలితంపై ఉత్కంఠ

author img

By

Published : Feb 8, 2020, 6:01 PM IST

Updated : Feb 29, 2020, 4:00 PM IST

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. గతంలో పోలిస్తే పోలింగ్ శాతం భారీగా తగ్గింది. సాయంత్రం 6 గంటల వరకు 57.06 శాతమే ఓటింగ్ నమోదైంది.

delhi assembly elections
దిల్లీ దంగల్​: ముగిసిన పోలింగ్

దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 70 స్థానాలకు జరిగిన పోలింగ్​లో 672 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్​ శాతం గణనీయంగా తగ్గింది. 2015లో 67 శాతం ఓటింగ్​ నమోదు కాగా ఈసారి 6 గంటల వరకు 57.06 శాతానికే పరిమితమైంది. ఓటింగ్ శాతం తగ్గడంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్​ సహా అనేక మంది ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​ అనిల్​ బైజల్​, విదేశీ వ్యహరాల మంత్రి ఎస్ జైశంకర్, ఎన్నికల ప్రధాన అధికారు సునీల్ అరోడా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తమ ఓటును వినియోగించుకున్నారు.

Last Updated : Feb 29, 2020, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.