దేశాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్... వైద్యులకు సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో సేవలందిస్తోన్న వైద్యునికి కరోనా నిర్ధరణ అయ్యింది. డాక్టర్‌తో పాటు గర్భిణి అయిన అతని భార్యకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. వారిని ప్రస్తుతం.. ఆస్పత్రిలోని ప్రత్యేక విభాగం(ఐసోలేషన్)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పుట్టబోయే బిడ్డకు వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌లోని మిగిలిన వైద్యులు అప్రమత్తం అయ్యారు. ముందస్తు జాగ్రత్తగా అన్ని చర్యలు పాటిస్తున్నారు.
ఇదీ చూడండి: 2వేలు దాటిన కరోనా కేసులు- 50కిపైగా మృతులు