ETV Bharat / bharat

నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి రాజ్​నాథ్​ శ్రీకారం - ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ చల్లాకరే క్యాంపస్

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్​, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంయుక్తంగా నిర్మించిన నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని రక్షణ మంత్రి రాజ్​​నాథ్​ సింగ్​ ప్రారంభించారు. ఈ రెండు సంస్థల మధ్య ఉన్న సహకారానికి ఈ కేంద్రం మంచి ఉదాహరణ అని అన్నారు.

Defence Minister inaugurates HAL-IISc skill development centre in Karnataka
నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన రాజ్​నాథ్​
author img

By

Published : Aug 13, 2020, 5:47 PM IST

కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ చల్లాకరే క్యాంపస్​లో ,హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ఐఐఎస్​సీ సంయుక్తంగా నిర్మించిన నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆవిష్కరణ, సృజనాత్మకతకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి ఎంతో అవసరమని రాజ్​నాథ్ సింగ్​ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్యున్యత విద్యాసంస్థకు, దేశంలో దిగ్గజ ఏరోస్పేస్​కు మధ్య ఉన్న సహకారానికి ఈ ఎస్​డీసీ చక్కటి ఉదాహరణ అని కొనియాడారు.

ఈ కార్యక్రమానికి త్రిదళాధిపితి బిపిన్ రావత్, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, కార్యదర్శి (రక్షణ ఉత్పత్తి) రాజ్ కుమార్, హెచ్ఏఎల్ సీఎండీ ఆర్ మాధవన్, డైరెక్టర్ (హెచ్ఆర్), హెచ్ఏఎల్, అలోక్ వర్మ ఐఐఎస్​సీ డైరెక్టర్ ప్రొఫెసర్ జి రంగరాజన్ పాల్గొన్నారు.

కేంద్రాన్ని స్థాపించడానికి 2016 మార్చి 28న హెచ్​ఏఎల్​, ఐఐఏస్​సీ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ నిర్మాణానికి 73.7 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం 1,500 ఎకరాల భూమిని అందించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.