ETV Bharat / bharat

బలపడిన వాయుగుండం- ముంచుకొస్తున్న'నివర్​' - PM Modi on Cyclone nivar

బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడింది. ఇది తీవ్రమై తుపానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 25న వాయుగుండం తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. తీరం దాటే సమయంలో ఆయా ప్రాంతాల్లో గంటకు 410-450 కిలోమీటర్ల మేర గాలులు వీస్తాయని పేర్కొంది.

Deep depression off TN intensifies into cyclonic storm
బంగాళా ఖాతంలో బలపడిన వాయుగుండం
author img

By

Published : Nov 24, 2020, 1:35 PM IST

బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రంగా మారింది. అది తుపాను మారి.. బుధవారం(నవంబర్​ 25న) తమిళనాడు, పుదుచ్చేరి తీరాలను దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపానుకు 'నివర్' అని పేరు పెట్టారు.​

Deep depression off TN intensifies into cyclonic storm
చెన్నైలోని రోడ్లు

నివర్​ ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కరైంకల్​ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు.. చెంబరంబక్కం వంటి జలాశయ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా.. లోతట్టు ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిపారు అధికారులు.

చెన్నైలో కురుస్తున్న వర్షం

ఆకాశం మేఘావృతమై..

విపరీతమైన గాలులు..

నైరుతీ బంగాళాఖాతంలో తీవ్రంగా మారిన వాయుగుండం.. పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ 'నివర్​'గా మారనుంది. ఈ సమయంలో పుదుచ్చేరి ప్రాంతంలో గంటకు 410 కిలోమీటర్ల నుంచి 450 కి.మీ. వరకు గాలులు వీచే అవకాశముందని వాతావారణ విభాగం తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఈ తుపాను మరింత బలపడి.. మరో 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది. ఈనెల 25న తమిళనాడు, పుదుచ్చేరిలోని కరైంకల్​-మామళ్లపురం మధ్య తీరం దాటే అవకాశముంది. ఆ సమయంలో గంటకు సుమారు 100-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. 'నివర్​' ధాటికి నైరుతీ బంగాళాఖాతంలో 65-75 కిలోమీటర్ల నుంచి 85 కిలోమీటర్ల వేగంతో చల్లని గాలులు వీస్తాయని పేర్కొంది.

తుపానుపై సీఎంలతో మోదీ ఆరా..

'నివర్' తుపానుపై​ ఆయా ముఖ్యమంత్రులతో చర్చించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం వీ నారాయణ సామిలతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధిత ప్రాంతాల్లో నివసిస్తున్న వారి భద్రత, శ్రేయస్సు కోసం తాను ప్రార్థిస్తున్నట్టు తెలిపారు మోదీ.

ఇదీ చదవండి: బీఎండబ్ల్యూ కారులో చెత్త ఎత్తి.. వినూత్న నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.