పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
"కచ్చితంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. అయితే ఎప్పుడు అనేది త్వరలో నిర్ణయిస్తాం."
- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
కరోనా కారణంగా పార్లమెంట్ ఉభయ సభలను మార్చి 23 నుంచి నిరవధికంగా వాయిదా వేశారు. బడ్జెట్ సెషన్‌ను కూడా కుదించారు.
సమయం ఉంది..
పార్లమెంట్ ఉభయ సభల నిర్వహణకు సెప్టెంబర్ వరకు సమయం ఉందని జోషి తెలిపారు. చాలా సార్లు ఆగస్టు చివరినాటికి లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
నిబంధనల ప్రకారం రెండు పార్లమెంట్ సమావేశాల మధ్య వ్యవధి 6 నెలలకు మించి ఉండకూడదు.
ఇదీ చూడండి: వర్చువల్ కాదు.. భౌతికంగానే పార్లమెంట్ సమావేశాలు!