ETV Bharat / bharat

కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 26కు మృతులు

author img

By

Published : Aug 8, 2020, 8:07 PM IST

కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరింది. ఇప్పటికీ పలువురి ఆచూకీ తెలియరాలేదు. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Death toll rises to 26 in the Idukki landslide
కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 26కు చేరిన మృతులు

కేరళ ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఇప్పటివరకు 26 మంది మృతిచెందారు. మరో 46 మంది ఆచూకీ తెలియలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు, ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే భారీగా కురుస్తోన్న వర్షాలు గాలింపు చర్యలకు అంతరాయం కలిగిస్తున్నాయి.

రాష్ట్రమంత్రి ఎంఎం మణి ఘటనా స్థలానికి చేరుకుని... అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

శిథిలాలను పూర్తిగా తొలగిస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎన్​డీఆర్​ఎఫ్ శుక్రవారం రక్షించిన 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది జిల్లా యంత్రాంగం.

ఇదీ చూడండి: 'ఆ ప్రాంతం నుంచి చైనా వెనక్కి మళ్లాల్సిందే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.