ETV Bharat / bharat

దేశంలో ఆగని కరోనా వ్యాప్తి-12వేలకు చేరువలో కేసులు

author img

By

Published : Apr 15, 2020, 8:21 PM IST

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,118 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 392 మంది మరణించారు. కరోనాను పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం... 170 జిల్లాల్ని హాట్​స్పాట్లుగా ప్రకటించింది.

Death toll due to COVID-19 rises to 392; cases climb to 11,933: Health Ministry
దేశంలో ఆగని కరోనా వ్యాప్తి-12వేలకు చేరువలో కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,118 మందికి కరోనా సోకగా... 39 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 11,933కి చేరింది. 392 మంది కరోనా కాటుకు బలయ్యారు. 1,343 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.

మహారాష్ట్ర అతలాకుతలం

దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో... పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2,918కి పెరిగింది.​ ఒక్క ముంబయిలో కొత్తగా 183 కేసులు నమోదుకాగా... మొత్తం కేసుల సంఖ్య 1936కి చేరింది. ఇవాళ ఇద్దరు కరోనా మృతి చెందగా.. మరణాల సంఖ్య 113కి పెరిగింది. 181 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

కరోనా మృతుల్లో భోపాల్ దుర్ఘటన బాధితులు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక్కడ కొత్తగా 117 కరోనా కేసులు నమోదైనందున మొత్తం కేసుల సంఖ్య 544కి పెరిగింది. వీరిలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నగరంలో మరణాల రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా...6.8 శాతంగా ఉంది.

మరోవైపు భోపాల్‌లో కరోనాతో మృతి చెందిన ఐదుగురు వ్యక్తులు.... 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులని అధికారులు తెలిపారు.

రాజస్థాన్​లో పెరుగుతున్న కరోనా కేసులు

రాజస్థాన్‌లో ఇవాళ కొత్తగా 41 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 1,046కి చేరింది. వైరస్‌ కారణంగా ఇవాళ 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్​ప్రదేశ్​లోనూ 67 కేసులు బయటపడగా.. ఇవాళ మరో ముగ్గురు మృతి చెందారు. దిల్లీలో కేసులు తగ్గుముఖం పట్టనందున కరోనా రోగులకు ప్లాస్మా చికిత్స అందించాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఉత్తరాఖండ్​లో మాత్రం ఇవాళ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కేవలం 37 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేరళలోనూ ఈరోజు ఒక్క కేసు మాత్రమే నమోదవడం గమనార్హం.

రూపానీకి కరోనా లేదు

గుజరాత్​లో మరో 56 కేసులతో బాధితుల సంఖ్య 695కు చేరింది. ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లగా.. ఆయనకు కరోనా లక్షణాలు లేవని వైద్యులు ధ్రువీకరించారు.

రాష్ట్రాలవారీగా ఇవాళ నమోదైన కేసులు

తమిళనాడు: కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,242కు చేరింది. వైరస్‌ కారణంగా ఇవాళ మరో ఇద్దరు మృతి చెందారు.

కర్ణాటక: ఈ రోజు కొత్తగా 17 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 277కి పెరిగింది. వైరస్‌ బారిన పడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 80 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

జమ్ము కశ్మీర్​: కొత్తగా 22 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 300కు పెరిగింది. వీటిలో జమ్ములో 54, కశ్మీర్​లో 246 కేసులున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

బంగాల్​: గత 24 గంటల్లో 12 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 132కు చేరింది. ఇప్పటివరకు బంగాల్​లో ఏడుగురు మరణించారు.

హరియాణా: మరో ఆరుగురు వైరస్​ బారినపడ్డారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 190కి చేరింది. ఇక్కడ ఇద్దరు మృతిచెందారు. 42 మంది కోలుకున్నారు.

చిన్నారికి ఆలనాపాలన చూసిన వైద్య సిబ్బంది

ఛత్తీస్​గఢ్​ రాయపూర్‌ ఎయిమ్స్‌లో...కరోనా సోకిన ఒక మహిళకు మూడు నెలల వయస్సున్న కుమార్తె ఉండగా ఆ శిశువు ఆలనాపాలనను ఆస్పత్రి నర్సులు చూసుకుంటున్నారు. ఆ బాలికకు నర్సులు పాలు పడుతున్న దృశ్యాలను రాయపూర్‌ ఎయిమ్స్‌ విడుదల చేసింది.

ఇదీ చూడండి: 'దేశంలో మొత్తం 170 హాట్​స్పాట్​ ప్రాంతాలు గుర్తింపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.