ETV Bharat / bharat

దేశంలో కరోనా విజృంభణ- 11వేలకు చేరువలో కేసులు

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. బాధితుల సంఖ్య 10,815కి చేరింది. మొత్తం 353 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,190 మంది కోలుకున్నారు. 9,272 మందికి దేశంలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

VIRUS-CASES
దేశంలో కరోనా విజృంభణ
author img

By

Published : Apr 15, 2020, 6:00 AM IST

భారత్‌లో అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 10వేలు దాటింది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా వేయికి పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో దాదాపు 700 కేసులు దిల్లీ, మహారాష్ట్రలోనే నిర్ధరణ అయ్యాయి.

ఫలితంగా దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,815కి చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ వైరస్ బారినపడి 353 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల్లో 1,190 మంది కోలుకోగా ప్రస్తుతం మరో 9,272 మంది చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలోనే సగం..

దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 160కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 349 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితులు 2,334కు చేరారు.

దిల్లీ, తమిళనాట తీవ్రస్థాయిలో..

నిజాముద్దీన్ ఘటనతో దిల్లీలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దేశరాజధానిలో కేసుల సంఖ్య 1510కి చేరింది. వీరిలో 28మంది మృత్యువాతపడ్డారు.

తమిళనాడులోనూ వైరస్ తీవ్రత కొనసాగుతోంది. మర్కజ్‌ సమావేశం అనంతరం రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీస్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,173కి చేరగా 11మంది మరణించారు.

మరణాల్లో పెరుగుదల

మహారాష్ట్ర అనంతరం కరోనా వైరస్‌తో మరణించే వారిసంఖ్య మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో అధికంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 43మంది చనిపోగా, గుజరాత్‌లో 26మంది బలయ్యారు.

ఇదీ చూడండి: 24 గంటల్లో 29 మరణాలు, 1,463 పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.